• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇసుక మింగేస్తున్న రోజా, నాని అనుచరులు.. వెంకయ్యను విమర్శించే స్థాయి వైఎస్ జగన్‌కు లేదు?టీడీపీ !

|

వైసీపీ మంత్రులు..నేతలు వారు అనుచరులు ఇసుక మాఫియాగా మారారని టీడీపీ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. వైకాపా మాఫియా ఇతర రాష్ట్రాలకు ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తోంది టీడీపీ నేతలు మండి పడ్డారు. ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కొరత కారణంగానే 14న చంద్రబాబు దీక్ష చేపట్టారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు దీక్షకు ముందుగా టీడీపీ నేతలు వైసీపీ ఇసుక దోచుకుంటోందంటూ..ఆధారాలు సైతం ఇస్తున్నామంటూ చార్జ్ షీట్ విడుదల చేసింది. అదే సమయంలో ప్రభుత్వంలోని పలువురు మంత్రులు..నేతల అనుచరులు ఇసుకను మింగేస్తున్నారంటూ మండిపడ్డారు. ఇక, సీఎం జగన్ తాజాగా ఇంగ్లీషు మీడియం పైన వ్యాఖ్యానించినందుకు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పైన ముఖ్యమంత్రి చేసిన కామెంట్లను టీడీపీ నేతలు తప్పు బట్టారు. వెంకయ్యను విమర్శించే స్థాయి జగన్ కు లేదని ఫైర్ అయ్యారు.

టార్గెట్ పవన్..సీఎం జగన్ ఎంపిక చేసింది వారినే : ఎటాకింగ్ బాధ్యత వారికే : వైసీపీ ధీమా ఇదే..!టార్గెట్ పవన్..సీఎం జగన్ ఎంపిక చేసింది వారినే : ఎటాకింగ్ బాధ్యత వారికే : వైసీపీ ధీమా ఇదే..!

ప్రభుత్వమే కారణంగా..అందుకే చంద్రబాబు దీక్ష

ప్రభుత్వమే కారణంగా..అందుకే చంద్రబాబు దీక్ష

ప్రభుత్వం సృష్టించిన కృత్రిమ కొరత కారణంగానే 14న చంద్రబాబు దీక్ష చేపట్టారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. వైకాపా మాఫియా ఇతర రాష్ట్రాలకు ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తోందని ఆరోపించారు. దీనికి అన్ని ఆధారాలతో కూడిన ఛార్జ్ షీట్ విడుదల చేస్తున్నాం అంటూ పేర్కొన్నారు. జిల్లాల వారీగా వైకాపా నేతల పాత్ర ఇసుక మాఫియాలో ఉందంటూ ఛార్జ్ షీట్ ను టీడీపీ నేతలు విడుదల చేసారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాఫియా ఇసుకను అమ్ముకుంటోందని విమర్శించారు. ఇతర రాష్ట్రాలకు ఇసుక ఏరకంగా రవాణా చేస్తున్నారో తెలియజేస్తామన్నారు. ఇసుకదీక్షకు అన్ని రాజకీయ పార్టీల సహకారం కోరుతున్నామని చెప్పుకొచ్చారు.

స్పీకర్..కొడాలి నాని..రోజా అనుచరులు ఇలా..

ఏపిలో వైసిపి ప్రభుత్వమే కృత్రిమ ఇసుక కొరత సృష్టించిందని..రోడ్డున పడ్డ అన్ని వర్గాలకు బాసటగా నిలిచేందుకు ఇసుకదీక్ష చేస్తున్నామని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. అన్ని వర్గాలవారూ ఇసుకదీక్షకు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు. ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సామాన్య మానవుడి జీవనాన్ని రక్షించేందుకు ఇసుకదీక్ష చేస్తున్నామన్నారు. వైసిపి ఎంఎల్ఏలు, మంత్రుల అనుచరులు, బంధువులు ఇసుకను మింగేస్తున్నారని విమర్శించారు. స్పీకర్ తమ్మినేని, కొడాలి నాని, బొత్స, తానేటి వనిత, ఉదయభాను, ఆమంచి, మేకపాటి గౌతంరెడ్డి, అవినాష్ రెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి, మేడా మల్లిఖార్జున రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, నగరి ఎంఎల్ఏ రోజా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు, బంధువులు ఈ లిస్టులో ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. బొత్స సత్యనారాయణ తన రివ్యూ మీటింగ్ లో తమ ఎంపి మీదే ఆరోపణలు చేసారని వివరించారు.

వెంకయ్యను విమర్శించే స్థాయి లేదు..

వెంకయ్యను విమర్శించే స్థాయి లేదు..

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉన్న 209 రీచ్ ల నుంచి అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. ఆన్ లైన్లో ఎవరికి దొరుకుతోందో వైసిపి చెప్పాలని డిమాండ్ చేసారు. పదుల సంవత్సరాలుగా లేనిది ఇప్పుడెలా ఇసుక కొరత వచ్చిందని ప్రశ్నించారు. ఇసుక వారోత్సవాలా..మాఫియా వారోత్సవాలా ఏవి నిర్వహిస్తున్నారని నిలదీసారు. మాజీ ఎంఎల్ఏ బొండా ఉమామహేశ్వరరావు వైసీపీ ప్రభుత్వం మీద మండిపడ్డారు. నలభైవేలకి ఇసుక ఎన్ని లారీలైనా వైసిపి ప్రభుత్వం ఇస్తుందని ఎద్దేవా చేసారు. ఆన్ లైన్ లో కావాలంటే మాత్రం వరదలు అడ్డొస్తాయన్నారు.

తెలుగు భాషపై అనాలోచిత నిర్ణయం

తెలుగు భాషపై అనాలోచిత నిర్ణయం

తెలుగుభాష మీద వైసీపీ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకుందని..తెలుగు రాష్ట్రంలో తెలుగును ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నాని ఆరోపించారు. వేరెవరికో ప్రయోజనం చేయద్దని మేధావులు అంటుంటే సిఎం జగన్ తెలుగును లేకుండా చేస్తున్నారని.. వెంకయ్య నాయుడు వంటి వారిని వ్యతిరేకించే స్ధాయి జగన్ కు లేదని పేర్కొన్నారు. తెలుగు మీడియం రద్దు చేయడంపై ప్రతిపక్షాలు చేసిన విమర్శలపై స్పందిస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డి సోమవారం ఓ సభలో వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారాయి.

English summary
TDP released charge sheet on YCP leaders on sand crisis. They involved many ministers and leaders names in this cissue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X