• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాన్చుడు బేరాలు చెయ్యొద్దు మహా ప్రభో.. మీకు దండం పెడతాం!!

|
Google Oneindia TeluguNews

ఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించి ఈసారి ఎలాగైనా అధికారం చేజ‌క్కించుకోవాల‌నే కృత‌నిశ్చ‌యంతో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబుకు పార్టీ నాయ‌కులు ఊహించ‌ని షాక్ ఇస్తున్నారు. ప్ర‌త్య‌ర్థితో గొడ‌వ ప‌డ‌టం మానేసి త‌మ‌లో తామే క‌ల‌హించుకుంటున్నారు. పార్టీ ప‌రువును బ‌జారున ప‌డేస్తున్నారు. అంద‌రూ ప‌నిచేయాల‌ని, తానొక్క‌డినే క‌ష్ట‌ప‌డంవ‌ల్ల ఉప‌యోగం ఉండ‌ద‌ని బాబు చెబుతున్న‌ప్ప‌టికీ వాటిని అంద‌రూ పెడ‌చెవిన పెడుతున్నారు.

 నాన్చుడు ధోరణి వద్దంటున్న తెలుగు తమ్ముళ్లు

నాన్చుడు ధోరణి వద్దంటున్న తెలుగు తమ్ముళ్లు


ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గానికి ఒక ఇన్ఛార్జి కాకుండా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇద్ద‌రు ముగ్గురు కూడా పార్టీ త‌ర‌ఫున కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నా. త‌మ‌కే సీటు ఖ‌రారైందంటూ ర్యాలీలు చేస్తున్నారు. అప్పటికే అక్కడ మరొకరు పనిచేసుకుంటున్నారు. ఇటువంటి నియోజకవర్గాలు చాలావున్నాయని, ముందుగా ఇటువంటివాటిపై స‌మాచారం తెప్పించుకొని పార్టీ శ్రేణుల‌కు ఒక స్ప‌ష్ట‌త ఇవ్వాలని తెలుగు తమ్ముళ్లు డిమాండ్ చేస్తున్నారు. తాను మారానంటూ దూకుడైన రాజకీయం చేస్తున్న చంద్రబాబు గతంలోలా ఈ విషయంలో నాన్చుడు ధోరణితో ఉంటే మొద‌టికే మోసం వ‌స్తుందని హెచ్చరిస్తున్నారు.

 ప్రొద్దుటూరు నుంచి సత్తెనపల్లి వరకు..

ప్రొద్దుటూరు నుంచి సత్తెనపల్లి వరకు..


ప్రొద్దుటూరులో ఇన్‌ఛార్జిగా ఉన్న ప్ర‌వీణ్‌కుమార్‌రెడ్డి ఇటీవలే ర్యాలీ నిర్వ‌హించి సంబ‌రాలు చేసుకున్నారు. కేక్‌ క‌ట్‌ చేశారు. సీటు ఖాయమన్నారని, పనిచేసుకోమన్నరాని చెప్పారు. అయితే దీన్ని కడప పార్లమెంటు అధ్యక్షుడిగా ఉన్న లింగారెడ్డి కొట్టేశారు. సీటు ఎవరికీ ఇవ్వలేదని, తనకే వస్తుందన్న నమ్మకం ఉందన్నారు. న‌ర‌స‌రావుపేట అసెంబ్లీకి ప‌నిచేసుకోమ‌ని త‌న‌కు చెప్పారంటూ డాక్ట‌ర్ చ‌ద‌ల‌వాడ అర‌వింద‌బాబు ప్ర‌క‌టించారు. కొన్నాళ్లుగా ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గుంటూరు ప‌శ్చిమ‌లో కోవెలమూడి నాని, మ‌న్న‌వ మోహ‌న్‌కృష్ణ పోటీప‌డుతున్నారు. వీరు కాకుండా చివ‌రి నిముషంలో ఎవ‌రొస్తారో తెలియ‌దు. ప్రతి ఎన్నికకు చివరి నిముషంలో అభ్యర్థి ఖరారవడం ఆనవాయితీగా వస్తోంది.

 త్వరగా తేల్చమంటున్న శ్రేణులు

త్వరగా తేల్చమంటున్న శ్రేణులు


రాజధాని పరిధిలోని తాడికొండ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఇద్ద‌రు పోటీప‌డుతున్నారు. శ్రీ‌కాకుళం జిల్లా పాత‌ప‌ట్నం నుంచి ఇద్ద‌రు పోటీలో ఉన్నారు. ఇద్ద‌రు నేతలు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తున్నారు. పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనంత‌పురం అర్బ‌న్ లో తాము చెప్పిన‌వారికే సీటివ్వాలంటూ జేసీ సోద‌రులు చంద్ర‌బాబుపై ఒత్తిడి తెస్తున్నారు. ఇక్క‌డ ఇన్‌చార్జిగా ఉన్న ప్ర‌భాక‌ర్ చౌద‌రితో వారికి కాంగ్రెస్‌లో ఉన్న‌ప్ప‌టినుంచి విభేదాలున్నాయి. అవి మ‌రింత‌గా పెరిగి టీడీపీపై ప్ర‌భావాన్ని చూపిస్తున్నాయి. ప్ర‌కాశం జిల్లాసంత‌నూత‌ల‌పాడు, య‌ర్ర‌గొండ‌పాలెం నుంచి ముగ్గురేసి చొప్పున అభ్య‌ర్థులు సీట్లు ఆశిస్తున్నారు.
ఉమ్మడి గుంటూరు జిల్లా సత్తెనపల్లి నుంచి ముగ్గురు పోటీపడుతున్నారు. ఇలాంటివి అన్ని జిల్లాల్లో ఉన్నాయి. మరి చంద్రబాబునాయుడు వీటిపై ఎటువంటి నిర్ణయం తీసుకున్నా త్వరగా తీసుకోవాలని పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.

English summary
The party leaders are giving an unexpected shock to Telugu Desam Party leader Chandrababu who is determined to defeat the YSR Congress party and seize power this time anyway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X