జగన్ ఇలాకాకు 'కృష్ణా': గడ్డం తీయనని టిడిపి నేత సతీష్ శపథం
కడప: కడప జిల్లా పులివెందులకు కృష్ణా జలాలు వచ్చేదాకా తాను గడ్డం తీసివేయనని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి శపథం చేశారు. ఆదివారం నాడు ఆయనను వేంపల్లెలలో పార్టీ అనుచరులు కలిశారు.
పులివెందులకు కృష్ణా జలాల తరలింపు అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఈ సందర్భంగా సతీశ్ రెడ్డి మాట్లాడారు. ఈ ఏడాది చివరి నాటికి పులివెందులకు కృష్ణా జలాలు తప్పకుండా వస్తాయన్నారు. పులివెందుల భూమిని కృష్ణా జలాలు ముద్దాడగానే తాను గడ్డం గీయించుకుంటానని చెప్పారు.
పులివెందులకు టిడిపి ప్రభుత్వం కృష్ణా జలాలు అందించి తీరుతుందన్నారు. కడప జిల్లాలోని ప్రాజెక్టులను నీటితో నింపేందుకు చంద్రబాబు చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు. బ్రహ్మసాగర్‌కు పూర్తిస్థాయిలో నీటిని ఇస్తారని, సీబీఐర్‌కు కనీసం నాలుగు టీఎంసీల నీరు వస్తాయని, అలాగే గండికోటకు నీళ్లు తెప్పించి అక్కడి నుంచి పులివెందులకు తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

ఈ ఏడాది వర్షాలు కూడా కరుణించాయన్నారు. రిజర్వాయర్‌లు నిండుగా ఉండటం మనకు అనుకూల పరిస్థితి ఏర్పడిందన్నారు. గండికోట ముంపువాసులకు మెరుగైన ప్యాకేజీ ఇస్తుందని, ఆ నియోజకవర్గ నాయకులతో కలిసి ముంపు వాసులతో సమావేశం నిర్వహించటి సంతోషంగా వెళ్లేలా పరిహారం ఇప్పిస్తామన్నారు. కాగా, వైయస్ కుటుంబం ఇలాకా అయిన కడప జిల్లాపై టిడిపి ప్రత్యేకంగా కన్ను వేసిన విషయం తెలిసిందే.
అనంతపురంకు చంద్రబాబు వరాల జల్లు
స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలకు ఆదిత్యమిచ్చిన అనంతపురం జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల జల్లు కురిపించారు. ఎన్టీఆర్ ఆశయం పేరుతో జిల్లా అభివృద్ధికి రూ.6554 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. ఎన్టీఆర్ ఆశయం పేరట ప్రకటించిన ఈ ప్యాకేజీ ప్రకటించారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications