ఒడిశాతో బాబు మాట్లాడితే: పోలవరంపై ఉమాభారతి ఆసక్తికరం, ఆదినారాయణ చేరికపై హెచ్చరిక

ఢిల్లీ/కడప: ఏపీలో నిర్మించ తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు పైన కేంద్రమంత్రి ఉమాభారతి గురువారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు పైన ఒడిశా చేస్తున్న అభ్యంతరాలను ఏపీ పరిగణనలోకి తీసుకోవాలని ఆమె అన్నారు. ఆమె ఢిల్లీలో విలేకరులతో మాట్లాడారు.

దానిపై ఒడిశా ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. కానీ ఏపీ, ఒడిశా సీఎంలు మాట్లాడుకుంటేనే బాగుంటుందన్నారు. పోలవరం గిరిజనుల జీవితాలతో ముడిపడిన సున్నితమైన సమస్యని, ప్రాజెక్టు నిర్మాణం చేపట్టక ముందే సమస్యలు సరిదిద్దుకోవాలన్నారు. ఏపీ, ఒడిశాకు కేంద్ర సహకారం తప్పకుండా ఉంటుందన్నారు.

ఆదినారాయణ రెడ్డిని చేర్చుకోవద్దు: టిడిపి ఎంపీటీసీలు

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటే తాము మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని స్థానిక తెలుగుదేశం నాయకులు, ఎంపీటీసీలు అధినాయకత్వానికి హెచ్చరికలు పంపించారు. ఆదినారాయణ రెడ్డిని టిడిపిలో చేర్చుకోవద్దని చెప్పారు.

TDP leaders say no to Adinarayana Reddy entry

రాజ్‌నాథ్ సింగ్‌కు నివేదిక

కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు ఏపీ హోంశాఖ మంత్రి చినరాజప్ప గురువారం నాడు ఏపీలో వరదలు, కరువు పైన నివేదికను సమర్పించారు.

జగన్‌కు ఆ పని తప్ప మరొకటి లేదు: యనమల

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి తమ ప్రభుత్వాన్ని విమర్శించడం తప్ప మరొక పని లేదని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఈసారి వ్యవసాయానికి రూ.6,640 కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉండటం వల్ల ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేస్తున్నామని తెలిపారు. రూ.10వేల కోట్లతో గృహ నిర్మాణం చేపడతామన్నారు. వివాదంలో ఉన్న డిఎస్సీ ఉద్యోగాలతో పాటు పలు పోస్టులను త్వరలో భర్తీ చేస్తామన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+