కోడెల ఆత్మహత్యపై గవర్నర్ తో రేపు తెలుగు తమ్ముళ్ళ భేటీ .. విచారణ చెయ్యాలని కోరనున్న టీడీపీ

టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపింది. కోడెల శివప్రసాద్ ఆత్మహత్యపై అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ ప్రభుత్వం వేధింపుల వల్లే కోడెల ఆత్మహత్య చేసుకున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి వేధింపులు, హింస ఎక్కువయ్యాయని వారు ఆరోపిస్తున్నారు.ఇక ఈ క్రమంలో గురువారం టిడిపి నేతలు ఏపీ గవర్నర్‌ హరిచందన్‌ను కలిసి కోడెల ఆత్మహత్యపై ఫిర్యాదు చేయనున్నారు. ముఖ్యంగా ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై విచారణ జరిపించాలని టిడిపి నేతలు గవర్నర్ హరిచందన్ ను కోరనున్నారు. కోడెల విషయంలో ఏం జరిగింది ? ఆయన ఇంత తీవ్ర నిర్ణయం తీసుకోవలసి వచ్చింది ? అన్న అంశాలపై వారు గవర్నర్ తో చర్చించనున్నారు.

TDP leaders will meet governor tomorrow about kodela suicide

అంతేకాకుండా టిడిపి కీలక నేతలపై పెడుతున్న కేసులపై గవర్నర్ కు ఫిర్యాదు చేయనున్నారు. అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులపై ప్రభుత్వం పెడుతున్న కేసులను, జరుగుతున్న దాడులను ఈ సంద్భంగా గవర్నర్‌కు నేతలు వివరించనున్నారు టిడిపి నేతల బృందం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+