జగన్ వర్సెస్ పవన్ వార్-టీడీపీ వ్యూహాత్మక మౌనం- వైసీపీని విమర్శించలేక-పాతమిత్రుడిని సమర్ధించలేక
ఏపీలో ఆన్ లైన్ సినిమా టికెట్ల వ్యవహారం చినికి చినిగి గాలివానగా మారిపోయి జగన్ సర్కార్ కూ జనసేనాని పవన్ కళ్యాణ్ కూ మధ్య మాటల యుద్ధానికి కూడా దారి తీస్తోంది. వైసీపీ మంత్రులకూ, పవన్ కూ మధ్య ఓ రేంజ్ లో సాగిపోతున్న మాటల యుద్ధంపై విపక్ష టీడీపీ మాత్రం నోరు మెదపడం లేదు. వాస్తవానికి వైసీపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలపై క్షేత్రస్దాయిలో సైతం పోరాటాలు చేస్తున్న టీడీపీ ఇక్కడ ఆన్ లైన్ టికెట్లపై భిన్నస్వరాలు వినిపిస్తున్నా చంద్రబాబు మాత్రం మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. దీంతో టీడీపీ మౌనం వెనుక ఉన్న కారణాలపై ఇప్పుడు ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

ఆన్ లైన్ టికెట్ల వివాదం
ఏపీలో ఆన్ లైన్ ద్వారా సినిమా టికెట్లను విక్రయించాలన్న వైసీపీ సర్కార్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. దీనిపై టాలీవుడ్ పరిశ్రమలోనే భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆన్ లైన్ టికెట్లు కావాలని కోరిన టాలీవుడ్ పెద్దలు ఇప్పుడు నోరు మెదిపేందుకు ఇష్టపడటం లేదు. అదే సమయంలో దీన్ని వ్యతిరేకిస్తున్న వారు మాత్రం స్వరం పెంచుతున్నారు. దీంతో వైసీపీ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఎప్పుడు అమల్లోకి వస్తుందన్న దానిపైనా క్లారిటీ లేకుండా పోతోంది. ఇప్పటికే రెండుసార్లు నిర్మాతలు సమాచార మంత్రి పేర్నినానితో చర్చలు జరిపినా దీనిపై తుది నిర్ణయం మాత్రం వెలువడలేదు. దీంతో ఆన్ లైన్ టికెట్ల వివాదం నానాటికీ ముదురుతోంది.

జగన్ వర్సెస్ పవన్ వార్
ఏపీలో ఆన్ లైన్ టికెట్లు విక్రయించాలన్న వైసీపీ ప్రభుత్వ నిర్ణయంపై టాలీవుడ్ లోనే భిన్నస్వరాలు వినిపిస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత, టాలీవుడ్ హీరో కూడా అయిన పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగారు. వైసీపీ సర్కార్ నిర్ణయాన్ని టార్గెట్ చేస్తూ తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. దీనికి వైసీపీ మంత్రులు కూడా దీటుగానే కౌంటర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఆన్ లైన్ టికెట్ల వివాదం కాస్తా జగన్ వర్సెస్ పవన్ వార్ గా మారిపోతోంది. ఇందులో జోక్యం చేసుకునేందుకు టాలీవుడ్ ప్రముఖులు సైతం ఆసక్తి చూపడం లేదు. అలాగని జగన్, పవన్ కూడా ఎక్కడా వెనక్కి తగ్గేందుకు ఇష్టపడటం లేదు. దీంతో ఆన్ లైన్ టికెట్ల వ్యవహారం భవిష్యత్తులో వైసీపీ సర్కార్ కు రాజకీయంగా ఇబ్బందులు తెచ్చిపెట్టేలా కనిపిస్దోంది.

నోరు మెదపని టీడీపీ
జగన్ వర్సెస్ పవన్ గా సాగిపోతున్న ఆన్ లైన్ సినిమా టికెట్ల వివాదంలో మాటల తూటాలు పేలుతున్నాయి. వ్యక్తిగత విమర్శలు కూడా నానాటికీ ఎక్కువవుతున్నాయి. అయినా కీలకమైన విపక్షంలో ఉన్న టీడీపీ మాత్రం దీనిపై స్పందించడం లేదు. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అధికారికంగా తమ స్పందన తెలియజేసేందుకు మొగ్గు చూపడం లేదు. కేవలం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, వైసీపీ మంత్రుల కౌంటర్లపై మాత్రమే కిందిస్ధాయి నేతలు స్పందిస్తున్నారు. పార్టీ అధినేత అయిన చంద్రబాబు ఇప్పటికీ దీనిపై స్పష్టమైన వైఖరి ప్రకటించేందుకు జంకుతున్నారు. దీంతో టీడీపీ మౌనంపై చర్చ మొదలైంది. అసలు ఈ వ్యవహారంపై టీడీపీ అధికారికంగా స్పందిస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టమన్న చర్చ సాగుతోంది.

టాలీవుడ్ తో టీడీపీ సంబంధాలు
తెలుగు సినీ పరిశ్రమతో టీడీపీకి సుదీర్ఘ అనుబంధం ఉంది. స్వయంగా టీడీపీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ దగ్గరి నుంచి బాలకృష్ణ, మురళీమోహన్, దివ్యవాణి, వాణీ విశ్వనాథ్ వరకూ టీడీపీకి చెందిన వారు సినీ పరశ్రమలో చాలా మందే ఉన్నారు. వీరికి పరిశ్రమలోని పెద్దలతో పాటు చిన్నా చితకా నటీనటులతో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. అయితే తాజాగా వైసీపీ ప్రభుత్వానికి ఆన్ లైన్ టికెట్ల ప్రతిపాదన చేసిన నటీనటులు, నిర్మాతలు గతంలోనూ టీడీపీతో సత్సంబంధాలు కొనసాగించిన వారే. జగన్ అధికారంలోకి వచ్చాక ఆయన్ను చాలాకాలం పాటు కలిసేందుకు వారు ఇష్టపడకపోవడం వెనుక కూడా ఇదే కారణమని చెప్తుంటారు. దీంతో టాలీవుడ్ తో సుదీర్ఘ అనుబంధం కలిగిన టీడీపీ పాత్ర ఇక్కడ ఆన్ లైన్ టికెట్ల వ్యవహారంలోనూ కీలకంగా మారిపోయింది.

పవన్ ను సమర్ధించలేక, వైసీపీని విమర్శించలేక
ఏపీలో వైసీపీ సర్కార్ తీసుకున్న ఆన్ లైన్ సినిమా టికెట్ల విక్రయాల నిర్ణయం వెనుక టాలీవుడ్ కు చెందిన పలువురు హీరోలు, నిర్మాతలు ఉన్నారు. అలాగే వీరి వెనుక వందలాది మంది టీడీపీతో అనుబంధం కొనసాగిస్తున్న వారు కూడా ఉన్నారు. దీంతో ఇప్పుడు వీరి కోరిక మేరకు వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విమర్శిస్తూ పవన్ కళ్యాణ్ తో కలిసేందుకు టీడీపీ ఇష్టపడటం లేదు. అలాగని వైసీపీ ప్రభుత్వ నిర్ణయాన్ని బహిరంగంగా సమర్ధించే వరిస్ధితి కూడా లేదు. దీంతో టీడీపీ నేతలు ఈ వ్యవహారంలో పడి నలిగిపోతున్నారు. అసలే ఏపీలో మారుతున్న రాజకీయ పరిస్ధితుల్లో వైసీపీ సర్కార్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలుపుకుని పోరాడేందుకు ఓవైపు ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ .. ఆన్ లైన్ టికెట్ల వ్యవహారం వరకూ మాత్రం ఎలాంటి స్పందన లేకుండా కాలక్షేపం చేసేందుకే మొగ్గుచూపుతోంది.
Recommended Video

టీడీపీకి ముందునుయ్యి.. వెనుక గొయ్యి
టాలీవుడ్ కోరిక మేరకు వైసీపీ సర్కార్ తీసుకున్న ఆన్ లైన్ టికెట్ల విక్రయాల నిర్ణయంపై ఇప్పుడు టీడీపీ పరిస్ధితి ముందు నుయ్యి, వెనుక గొయ్యిగా మారిపోతోంది. అటు టాలీవుడ్ ను కానీ, వైసీపీ సర్కార్ ను కానీ విమర్శించలేక, అలాగని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను సమర్ధించలేక టీడీపీ నానా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇక్కడ ఎవరికి కదిపినా టీడీపీ చేతికి బురద అంటుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అటు పవన్ ను సమర్ధిస్తే టాలీవుడ్ ప్రముఖులు టీడీపీకి దూరం కావడం ఖాయం. అలాగని వైసీపీని విమర్శిస్తే తిరిగి టాలీవుడ్ కు కోపం వస్తుంది. అలా కాదని కేవలం టాలీవుడ్ నిర్ణయాన్ని తప్పుబట్టినా టీడీపీకి ఇబ్బందులు తప్పవు. దీంతో ఎలా చూసినా టీడీపీకి ఈ వ్యవహారంలో స్పందించడం కంటే మౌనంగా ఉండిపోవడమే కరెక్టన్న వాదన వినిపిస్తోంది.
-
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
పట్టు చిక్కుతున్న వేళ చంద్రబాబు చేతికి జగన్ మరో అస్త్రం, సెల్ఫ్ గోల్..!! -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
వాళ్లను వదలొద్దు- రఘురామ, పవన్ కళ్యాణ్ డిమాండ్..! -
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..!












Click it and Unblock the Notifications