రమ్యశ్రీ, నారా రోహిత్ శుభాకాంక్షలు: లోకేష్ రక్తదానం (పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ జన్మదిన వేడుకలు శుక్రవారం నాడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో ఘనంగా జరిగాయి. తన రాజకీయ ప్రస్థానంపై రూపొందించిన జన్మదిన ప్రత్యేక సంచిక ‘లోకేశ్ - కనెక్టింగ్ ద పీపుల్' పుస్తకాన్ని శుక్రవారం తన నివాసంలో లోకేశ్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ... తన పుట్టిన రోజు సందర్భంగా డబ్బులను కేకులకు పెట్టే బదులు పేదవారికి ఇవ్వాలని సూచించారు.
ఇప్పుడు తన కుటుంబం అరకోటి అన్నారు. టీడీపీ సభ్యత్వాలు యాభై లక్షలు దాటిన విషయం తెలిసిందే. ఏ ఆపద వచ్చినా తాను ఉన్నానని చెప్పారు. టీడీపీని ఏ శక్తి ఆపలేదన్నారు.

నారా లోకేష్
తన అమ్మా నాన్నకు నేను ఒక్కడినేనని, తనకు మాత్రం అండగా అర కోటిమంది కార్యకర్తలున్నారని, దేశంలో ఏ పార్టీకీ లేని బలం మన పార్టీకి ఉందని లోకేష్ ఈ సందర్భంగా అన్నారు.

నారా లోకేష్
తెలుగుదేశం పార్టీకి బలం కార్యకర్తలే. ఏ ఆపద వచ్చినా మీ అందరికీ నేనున్నానని, ఏ శక్తి మనల్ని వేరు చేయలేదని, ఎన్ని ఇబ్బందులు పెట్టినా జంకకుండా అండగా నిలిచిన కార్యకర్తలందరికీ కృతజ్ఞతలన్నారు.

నారా లోకేష్
కార్యకర్తల అండ ఉన్నంత వరకూ టీడీపీని ఏ శక్తి ఆపలేదన్నారు. ఏపీ ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలను ప్రతి కార్యకర్త, నాయకుడు పేదలకు అందించేలా కృషి చేయాలని కోరారు.

నారా లోకేష్
అలాగే, తెలంగాణ ప్రభుత్వం తీసుకునే అవినీతి విధానాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో టీడీపీ బలంగా ఉందని చెప్పారు.

నారా లోకేష్
టీడీపీ మహా వృక్షమని, దాని వేర్లు చాలా బలంగా పాతుకుపోయి ఉన్నాయని, చెట్టును ఎవరూ ఏమీ చేయలేరని, కేవలం ఎండిపోయిన కొన్ని ఆకులు మాత్రమే రాలుతున్నాయని పార్టీని వీడిపోతున్న నేతల గురించి లోకేశ్ వ్యాఖ్యానించారు.

నారా లోకేష్
ఇకపై మరింత ముందుకెళ్లడానికి మీరందరూ సహాయ సహకారాలు అందించాలని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయ కర్తగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది తొలి పుట్టిన రోజు కావడంతో నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.

నారా లోకేష్
నారా లోకేశ్ నివాసం నుంచి, ఎన్టీఆర్ భవన్ వరకూ అభిమానులు భారీగా ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. బాణసంచా, డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు.

నారా లోకేష్
ఆయనతో కరచాలనం చేసేందుకు నేతలు, కార్యకర్తలు పోటీ పడ్డారు. ఎన్టీఆర్ భవన్లో లోకేశ్ తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

నారా లోకేష్
అనంతరం తెలుగు యువత అధ్యక్షుడు బీద రవిచంద్రయాదవ్ అధ్యక్షతన తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్, టీఎస్‌ఎన్వీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 32 కిలోల భారీ కేక్‌ను లోకేశ్ కట్ చేశారు.

నారా లోకేష్
టీఎన్‌ఎస్‌ఎఫ్ నేతలు తల్వార్, తలపాగా బహుకరించి, గజమాలతో సత్కరించారు. టీఎస్‌ఎన్‌వీ నాయకులు పూల కిరీటం, బాణం బహూకరించి గజమాలతో సత్కరించారు.

నారా లోకేష్
ఎన్టీఆర్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంకులో లోకేశ్ రక్తదానం చేశారు. బ్రాహ్మణ సంఘటన అధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య ఆధ్వర్యంలో శృంగేరి శంకరమఠం వేదపండితులు లోకేశ్‌ను వేద మంత్రాలతో ఆశీర్వదించారు.

నారా లోకేష్
కాగా, లోకేశ్‌కు ఎంపీ గల్లా జయదేవ్, మంత్రి పీతల సుజాత, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, సినీ నటుడు నారా రోహిత్, నటి రమ్యశ్రీ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications