టీడీపీ రివర్స్ గేమ్ - జగన్ ట్రాప్ లో చిక్కితే : బీజేపీతో డిసైడ్ అయిపోయిందా..!!

ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ.ఒక పార్టీని రాజకీయంగా ఫిక్స్ చేయటానికి మరో పార్టీ ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా.. 2019 ఎన్నికల సమయంలో నాడు ప్రతిపక్ష నేతగా జగన్ అమలు చేసిన ప్లాన్ నే ఇప్పుడు టీడీపీ అమలు చేయటానికి సిద్ద పడుతోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలనేది టీడీపీ ప్రయత్నం. ఇదే సమయంలో పొత్తుల కోసం టీడీపీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. పవన్ కళ్యాణ్ - బీజేపీతో కలిసి వెళ్తే..వైసీపీ వ్యతిరేక ఓటు చీలే అవకాశం లేకుండా తమకు కలిసి వస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. ఇందులో భాగంగానే జనసేన అధినేత కండీషన్లు పెడుతున్నా.. పొత్తుల పైన సరైన సమయం వరకూ స్పందించకూడదని నిర్ణయించింది.

సీఎం జగన్ పై ఒత్తిడి పెంచే వ్యూహం

సీఎం జగన్ పై ఒత్తిడి పెంచే వ్యూహం


అదే సమయంలో బీజేపి -టీడీపీకి దగ్గరవ్వటం ఇప్పుడున్న పరిస్థితుల్లో సాధ్యమయ్యేలా కనిపించటం లేదు. కానీ, టీడీపీ మాత్రం రాజకీయాలో ఏదైనా జరగచ్చనే సిద్దాంతంతో ముందుకు వెళ్తోంది. ఇదే సమయంలో కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తుండటంతో ఆ బంధానికి బ్రేక్ పడితేనే..తమతో బంధం కలుస్తుందనే అంచనా తో ఉంది. దీంతో..2019 ఎన్నికల ముందు జగన్ ట్రాప్ లో చిక్కుకొని ఎన్డీఏ దూరమైన టీడీపీ.. ఇప్పుడు జగన్ ను అదే విధంగా బీజేపీ పెద్దలతో దూరం అయ్యేలా కొత్త వ్యూహాలకు పదును పెడుతోంది. 2019 లో జగన్ ఆడిన పొలిటికల్ గేమ్ ను.. ఇప్పుడు రివర్స్ గేమ్ గా ప్రారంభించింది. అందులో భాగంగా. .టీడీపీ అధినేత చంద్రబాబు తాజాగా కేంద్రానికి రాసిన లేఖలో పోలవరం విషయంలో కేంద్రం చేసిన సాయాన్ని ప్రశంసించారు. వైసీపీ ప్రభుత్వం పైన ఫిర్యాదు చేసారు.

బీజేపీ కి జగన్ దూరం చేయటం

బీజేపీ కి జగన్ దూరం చేయటం

ఇక, ఇప్పుడు పార్టీ సీనియర్ నేత యనమల కీలక వ్యాఖ్యలు చేసారు. జీఎస్టీలో రాష్ట్రం నష్టపోయేలా నిర్ణయాలు జరుగుతున్నా వైసీపీ ప్రభుత్వం కిక్కురుమనడం లేదని, ఏం జరిగినా కేంద్రానికి వంతపాడటం ఒకటే వైసీపీ విధానమా అంటూ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా సాధించుకొనే మంచి అవకాశం వచ్చినా ఏ షరతులు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి రాష్ట్ర యువత భవితను మంటగలిపారనే విమర్శలతో వైసీపీ పైన ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థికంగా రాష్ట్రం నష్టపోతున్నా కేంద్రానికి మద్దతు తెలుపుతున్నారంటూ యనమల విమర్శించారు. అయితే, రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ తమ విధానం ఏంటనేది మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. వైసీపీ ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతు ప్రకటించింది. టీడీపీ సైతం ఎన్డీఏ అభ్యర్ధికే మద్దతిచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

2024 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు

2024 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు

మద్దతు విషయంలో తమతో సంప్రదింపులు చేయకపోవటంతో..ఇప్పటికిప్పుడు ఎవరికి మద్దతు ఇచ్చే అంశం పైన స్పందించాల్సిన అవసరం లేదని టీడీపీ భావిస్తోంది. ఇంకా ఎన్నికలకు సమయం ఉండటంతో.. ఎన్డీఏతో - ఇటు జాతీయ స్థాయిలో విపక్షాల నుంచీ టీడీపీకి మద్దతు కోరుతూ అభ్యర్ధనలు వస్తే , పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో టీడీపీ ఉంది. అయితే, గతంలో తాను అమలు చేసిన ప్లాన్ నే ఇప్పుడు టీడీపీ అమలు చేస్తుండటంతో..ఆ ట్రాప్ లో జగన్ చిక్కుతారా అనేది సందేహమే. అయితే, టీడీపీ మాత్రం ఇదంతా 2024 లో జగన్ కు వ్యతిరేకంగా ఏ అవకాశం వదులుకోకూడదనే లక్ష్యంతో ..రాజకీయంగా మైండ్ గేమ్ ప్రారంభించింది. రానున్న రోజుల్లో మరిన్న రాజకీయ ఎత్తులు పై ఎత్తులతో ఏపీ రాజకీయం మరింత వేడెక్కటం ఖాయంగా కనిపిస్తోంది.


Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+