వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జివిఎల్ శిఖండి:మంత్రి నక్కా;మహిళల అక్రమ రవాణాలో ఏపీ నంబర్‌వన్...ఆ క్రెడిట్ చంద్రబాబుదే:కన్నా

|
Google Oneindia TeluguNews

గుంటూరు:టిడిపి అధినేత చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్షాల ఆరోపణలు సరికాదని మంత్రి నక్కా ఆనందబాబు తప్పుబట్టారు. దేశ ప్రయోజనాల కోసమే తమ పార్టీ పని చేస్తుందని చెప్పారు.

మోడీ అధికారం చేపట్టాక వచ్చాక వ్యవస్థలను భ్రష్టుపట్టించారని మంత్రి నక్కా దుయ్యబట్టారు. వ్యవస్థలో మార్పు కోసమే చంద్రబాబు జాతీయస్థాయిలో పార్టీలను ఏకం చేస్తున్నారని నక్కా చెప్పుకొచ్చారు. జీవీఎల్‌ లాంటి శిఖండితో తెలుగు దేశం పార్టీపై విమర్శలు చేయిస్తున్నారని మంత్రి నక్కా ఆనందబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే బీజేపీ, పవన్, జగన్ కూటమిగా ఏర్పడి పోటీ చేయాలని మంత్రి నక్కా ఆనంద్‌బాబు సవాల్ విసిరారు.

మరోవైపు వారం వారం ఎపి సిఎం చంద్రబాబుకు బహిరంగ లేఖ రాసే బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అదే క్రమంలో బుధవారం 18 వ లేఖను విడుదల చేశారు. ప్రతి లేఖలో ఐదు ప్రశ్నలను సంధిస్తున్న కన్నా లక్ష్మీనారాయణ తాజా లేఖలోను ముఖ్యమంత్రి చంద్రబాబుకు మరో ఐదు ప్రశ్నలు సంధించారు.

 TDP minister Nakka Anandbabu controversial comments over BJP MP GVL

ఆంధ్రప్రదేశ్‌ను మహిళల అక్రమ రవాణాలో నంబర్‌ వన్‌ స్థానంలో ఉంచిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని ఈ లేఖలో కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. దేశంలో అక్రమ రవాణాకు బలవుతోన్న మహిళల్లో 26 శాతం మంది ఏపీ వారేనని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ నివేదించిందని కన్నా గుర్తు చేశారు.
నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ నిధులు తీసుకుని తిత్లీకి కేంద్రం ఏమీ ఇవ్వలేదని ఆరోపించడం ఎంతవరకూ సబబు?''...అని కన్నా ప్రశ్నించారు.

''పోలవరం ప్రాజెక్టు ముంపు భూముల వ్యవహారంలో టీడీపీ నేతలు అక్రమంగా రూ.650 కోట్లు కాజేయలేదా?...అమరావతి డిజైన్ల రూపకల్పన సంస్థను మార్చిన వ్యవహారంలో రూ.90 కోట్ల ఒప్పందం వెనకున్న రహస్యమేంటి?...అగ్రిగోల్డ్‌ వ్యవహారంలో దర్యాప్తు సంస్థలను కోర్టులు తప్పు పట్టలేదా...అంటూ కన్నా తన లేఖలో చంద్రబాబుపై ఐదు ప్రశ్నలను సంధించారు.

English summary
There is a war of words between TDP BJP leaders in AP. In this order, these two party leaders are criticizing the rival party leaders.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X