రవి కిరణ్‌పై ఎస్సీ, ఎస్టీ 'పంచ్': కేసు పెట్టిన టిడిపి ఎమ్మెల్యే అనిత

Posted By:
Subscribe to Oneindia Telugu

విశాఖఫట్నం: పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు ఇంటూరి రవి కిరణ్‌పై మరో పంచ్ పడింది. ఆయనపై విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట తెలుగుదేశం పార్టీ శాసనసభ్యురాలు వంగలపూడి అనిత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు. కొద్దికాలంగా తాను ఎటువంటి సమావేశాలు నిర్వహించినా వెంటనే అదేరోజు సాయంత్రం ఆ అంశానికి సంబంధించి తనను కించపరుస్తూ, తన మాటలను వక్రీకరిస్తూ రవికిరణ్‌ సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు పెడుతున్నారని ఆమె ఆరోపించారు.

రాజకీయంగా తనను ఎదుర్కొనలేక మహిళననే కనీస గౌరవం కూడా లేకుండా అసభ్యకరంగా తనను చిత్రిస్తూ వేధిస్తున్నందున రవికిరణ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ నెల 19న విశాఖపట్నం మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో అనిత ఫిర్యాదు చేశారు.

Anitha

ఈ పోస్టింగ్‌ల వల్ల తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగిందని ఆమె ఆరోపించారు. పోలీసులు ఈ కేసును ఎస్సీ, ఎస్టీ వేధింపుల కేసుగా పరిగణించి ఏసీపీ మోహనరావుకు బదిలీ చేశారు. దీనిపై విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ రవికిరణ్‌కు ఆయన నోటీసులు పంపించినట్లు సమాచారం.

శాసనమండలిని కించపరిచారనే ఆరోపణలను ఇప్పటికే ఆయన ఎదుర్కుంటున్నారు. ఈ కేసులో ఆయనను తూళ్లూరు పోలీసులు అరెస్టు చేసి, ఆ తర్వాత విడుదల చేశారు. ఆయనపై శాసన మండలి చర్యలు తీసుకునే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugu Desam party (TDP) Payakaraopet MLA Vangalapudi Anitha complained against Political Punch cartoonist Inturi Ravikiran.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి