వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
హోదా ఎఫెక్ట్: కార్లు శుభ్రం చేసి బీజేపీకి టిడిపి ఎమ్మెల్యే ఉమ నిరసన
విజయవాడ: ప్రత్యేక హోదా అంశం తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల మధ్య విభేదాలు తీసుకు వస్తోంది. ఏపీకి హోదా ఇవ్వాలంటూ బీజేపీ కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ శుక్రవారం వినూత్నంగా నిరసన తెలిపింది. ఎమ్మెల్యే బొండా ఉమ చెవిలో పూవులు పెట్టుకొని కార్లు, బైకులు తుడుస్తూ నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా బోండా ఉమ మాట్లాడారు. విభజన హామీలను బీజేపీ నెరవేర్చడం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టుకు రూ.800 కోట్లు మాత్రమే ఇచ్చారని చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం బీజేపీ హామీ ఇవ్వడంతో రెండేళ్ల పాటు ఎదురు చూశామని చెప్పారు.

రెండేళ్ల పాటు ఎదురు చూడటం చాలా ఎక్కువ సమయమని అన్నారు. ఏపీ ప్రజలు ఇంతకు మించి సహనంతో ఉండలేరని బోండా ఉమ అన్నారు. ఇప్పటికైనా బీజేపీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు.