ప్రత్యేక హోదాపై జగన్‌ మాట్లాడే హక్కు లేదు: బొండా

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 6వ, తేదిన తమ పార్టీ ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ చేసిన ప్రకటనపై టిడిపి నేతలు మండిపడ్డారు.ఎన్డీఏ నుండి టిడిపి ఎప్పుడొస్తోందా వైసీపీ ఎప్పుడు చేరాలనే ఆతృతతో ఉందన్నారు.

టిడిపి ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర్ రావు, , టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నలు మంగళవారం సాయంత్రం అమరావతిలో మీడియాతో మాట్లాడారు. రెండేళ్ళ క్రితం ఎందుకు రాజీనామాలు చేయలేదని వైసీపీ నేతలను టిడిపి నేతలు ప్రశ్నించారు.

tdp mla bonda uma slams on ys jagan

ప్రత్యేక హోదా విషయమై ఇప్పుడు వైసీపీ ఎంపీలు రాజీనామా అస్త్రాన్ని ప్రకటించడం రాజకీయ ఉద్దశ్యమే కారణంగా పేర్కొన్నారు.జగన్ పాదయాత్రను ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు.ఈ కారణంగానే ఎంపీల రాజీనామాల అంశాన్ని తీసుకొచ్చారని చెప్పారు.

ఎన్డీఏ నుండి బయటకు వస్తే జగన్ చేతులు కలపాలని ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. గతంలో కూడ ఎంపీలతో రాజీనామాలు చేయిస్తామని చెప్పారని కానీ ఆచరణలో మాత్రం అమలు చేయలేదని వారు గుర్తు చేశారు. టిడిపి ఎంపీల రాజీనామాలు చేయాలన్నా, ఇంకా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా చంద్రబాబునాయుడు తీసుకొంటారని వారు చెప్పారు.కేసుల మాఫీ కోసమే జగన్ నాటకం ఆడుతున్నారని చెప్పారు. ప్రత్యేక హోదా గురించి మాట్లాడే హక్కు జగన్‌కు లేదన్నా

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
TDP MLA Bonda Uma Maheshwar Rao made allegations on ysrcp chief ys Jagan on Tuesday. Bonda Uma maheshwar Rao spoke to media along with TDP MLC Buddha Venkanna

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి