మీరు ఫోకస్ పెట్టారు రాష్ట్రం కనుమరుగవుతోంది .. సీఎం జగన్ పై టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల వ్యంగ్యం

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి పై, వైసిపి నేతలపై టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సెటైర్లు వేశారు. సీఎం జగన్ ఫోకస్ పెడితే ప్రతిపక్ష పార్టీల కనుమరుగవుతాయి అని వైసిపి నాయకులు చెప్పారని, కానీ మీరు రాష్ట్రం పై ఫోకస్ పెడితే రాష్ట్రమే కనుమరుగయ్యే పరిస్థితి వచ్చిందంటూ సెటైర్లు వేశారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

 అభివృద్ధికి ఆమడ దూరంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారని అసహనం

అభివృద్ధికి ఆమడ దూరంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారని అసహనం

ఇదే సమయంలో సోషల్ మీడియా వేదికగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన బుచ్చయ్య చౌదరి పాలన గతి తప్పి, చేసిన వాగ్దానాలను మరచి, ప్రభుత్వ పాలన కొనసాగించటం ఎంతోకాలం నిలవదు అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజా పరిపాలనపై మండిపడ్డారు. అభివృద్ధికి ఆమడ దూరంలో రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నారని అసహనం వ్యక్తం చేశారు . ఈ విచ్ఛిన్నమైన పాలన వల్ల ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు అంటూ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఏపీలో అస్తవ్యస్తమైన పాలన కొనసాగుతోందని విమర్శించారు.

 ముఖ్యమంత్రి గారు చేసిన పనులు చెప్పుకోవాలి కానీ పక్కవారివి కాదంటూ ఎద్దేవా

ముఖ్యమంత్రి గారు చేసిన పనులు చెప్పుకోవాలి కానీ పక్కవారివి కాదంటూ ఎద్దేవా

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి హితవు పలికారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి . ముఖ్యమంత్రి గారు చేసిన పనులు చెప్పుకోవాలి కానీ పక్కవారివి కాదంటూ ఎద్దేవా చేశారు. ప్రజల్లో నైరాశ్యం నెలకొంది అని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పట్టాలు తప్పిందని గోరంట్ల ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇక ఊసరవెల్లి లాగా ప్రభుత్వం రంగులు మారుస్తోంది అని ఆయన మండిపడ్డారు. ఊసరవెల్లి ఏ విధంగా అయితే రంగులు మారుస్తుందో, టిడ్కో ఇళ్లకు వైసీపీ కూడా రంగులు మారుస్తోంది అంటూ పేర్కొన్నారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి .

99 శాతం హామీల పూర్తి .. ఆ ఒక్క శాతం ప్రత్యేక హోదా కదా

99 శాతం హామీల పూర్తి .. ఆ ఒక్క శాతం ప్రత్యేక హోదా కదా

వైసిపి వాళ్ళు ఎన్నికలకు ముందు ఒక రంగు చూపించారు. ఎన్నికలయ్యాక ప్రజలకి వాళ్ళ అసలు రంగు చూపిస్తున్నారు అంటూ మండిపడ్డారు. అంతేకాదు మనుషులపైన మరుగుదొడ్ల పైన అయింది. ఇప్పుడు పందులు కుక్కల వంతు వచ్చిందంటూ ఏపీలో పెంపుడు జంతువులపై లైసెన్సింగ్ విధానంపై నిప్పులు చెరిగారు. ఇక పక్షుల వంతు ఉంది, ఎక్కువ ఎగిరితే ఫైన్ వేస్తారేమో అంటూ సెటైర్లు వేశారు. ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను 99 శాతం ఇప్పటికే పూర్తి చేశామని చెబుతోందని ఇక ఆ ఒక్క శాతం ప్రత్యేక హోదా కదా అంటూ ఆసక్తికర ట్వీట్ చేశారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

జగన్ పై , వైసీపీ నాయకులపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూపర్ పంచ్ లు

జగన్ పై , వైసీపీ నాయకులపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూపర్ పంచ్ లు

వైసీపీ ప్రభుత్వం పై ,జగన్ మోహన్ రెడ్డి విధానాలపై, వైసిపి నాయకులు తీరుపై ఆయన తనదైన శైలిలో సూపర్ పంచ్ లు వేస్తూనే ఉన్నారు.
గతంలో కూడా వైసీపీ ప్రభుత్వానికి అనేక మార్లు తనదైన సూచనలు సలహాలు ఇచ్చిన గోరంట్ల బుచ్చయ్య చౌదరి జగన్ క్యాబినెట్ లో వైసీపీ రంగుల మంత్రిత్వ శాఖను కేటాయించి ఓ మంత్రిని పెడితే బాగుంటుంది అంటూ సెటైర్ వేశారు .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+