చేదు అనుభవం: టిడిపి ఎమ్మెల్యే శివాజీని అడ్డుకొన్న పోలీసులు

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి:టిడిపి ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజీకి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. ఇటీవలే ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తుందని ఎమ్మెల్యే శివాజీని విజయవాడ కరకట్ట వద్ద పోలీసులు అడ్డుకొన్నారు. ఈ ఘటనను మరువకముందే అసెంబ్లీ వద్దే శివాజీని పోలీసులు అడ్డుకొన్నారు. ఐడి కార్డు చూపించాలని డిమాండ్ చేశారు.చేసేదేమీలేక ఆయన తన గుర్తింపు కార్డును చూపిన తర్వాతే భద్రత సిబ్బంది ఆయనను అసెంబ్లీలోనికి అనుమతిచ్చారు.

అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శ్రీకాకుళం జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ శివాజీకి పోలీసుల వల్ల మరోసారి చేదు అనుభవం ఎదురైంది. శుక్రవారం నాడు ఆయన అసెంబ్లీలోకి ప్రవేశిస్తోంటే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకొన్నారు.

tdp mla gouth shyam sundar sivaji faced bitter experince in andhra pradesh assembly premises

తాను ఎమ్మెల్యేనని చెప్పినా వారు వినలేదు. గుర్తింపుకార్డును చూపాల్సిందేనని ఆయనకు తేల్చిచెప్పారు.అయితే గుర్తింపుకార్డు చూపిన తర్వాత ఆయనను అసెంబ్లీ లోపలికి పోలీసులు అనుమతించారు.

కనీసం పిఎ కూడ లేని తనలాంటి వారిని సెక్యూరిటీ సిబ్బంది ఆపుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.కొందరు ఎమ్మెల్యేలు తమ వెంట పదుల సంఖ్యలో అనుచరులను తీసుకువచ్చినా అనుమతిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

నాలుగురోజుల క్రితమే ఆయన కరకట్టపై నుండి అసెంబ్లీకి వస్తుండగా పోలీసులు అడ్డుకొన్నారు. సిఎం కాన్వాయ్ వస్తోందని ఆయనను అడ్డుకోవడంతో కరకట్టపైనే భైఠాయించి ఆయన తన నిరసనను వ్యక్తం చేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
tdp mla gouth shyam sundar sivaji faced bitter experince in andhra pradesh assembly premises
Please Wait while comments are loading...