• search
 • Live TV
అనంతపురం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పవన్‌తో టీడీపీ ఎమ్మెల్యే గంటన్నరపాటు భేటీ, జైళ్లో పెట్టినా: బాబుకూ జనసేనాని ఝలక్!

|
Google Oneindia TeluguNews

Recommended Video

  పరిటాల ఇంటికి పవన్, గుండు కొట్టించడంపై సునీత

  అనంతపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం అనంతపురం జిల్లాలో పర్యటించారు. పర్యటన అనంతరం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆయనను కలిశారు. సుమారు గంటన్నర పాటు ఈ సమావేశం జరిగింది. ఇందులో పలు విషయాలపై చర్చించారని తెలుస్తోంది. ప్రభాకర్ చౌదరి స్థానికంగా ఉన్న సమస్యలను పవన్ దృష్టికి తీసుకు వెళ్లారని తెలుస్తోంది.

  చదవండి: ఇంత దుర్మార్గపు ఆలోచనా?: పవన్‌ను ఏకిపారేసిన లక్ష్మీపార్వతి

  చదవండి: కొత్తగూడెంలో జనసేనానికి చేదు: ఓ వైపు సీఐ మరోవైపు ఏసీపీ, పవన్ 20 ని.లు ఏం చెప్పారో

  ఆ తర్వాత ఓ హోటల్లో బస చేశారు. ఆదివారం ఆయన కదిరిలో పర్యటిస్తారు. కరువు పరిస్థితులపై స్థానికులతో సమావేశం నిర్వహిస్తారు. మధ్యాహ్నం పుట్టపర్తి హనుమాన్ జంక్షన్‌లో జరిగే సభలో పాల్గొంటారు. అనంతరం సత్యసాయి మందిరాన్ని సందర్శిస్తారు. 29వ తేదీన ధర్మవరంలో చేనేత కార్మికులతో సమావేశమవుతారు. అనంతరం మధ్యాహ్నం హిందూపురంలో జనసేన కార్యకర్తలతో భేటీ అవుతారు.

  చదవండి: నీ స్థాయేంటి? మద్దతిస్తానంటే రాహుల్ వద్దకు తీసుకెళ్తా: పవన్ కళ్యాణ్‌పై రేవంత్

  నా వెంట ఉండేదంతా యువతే అంటారు

  నా వెంట ఉండేదంతా యువతే అంటారు

  కాగా, శనివారం పవన్ కళ్యాణ్ అనంతపురంలో పర్యటించిన సమయంలో కీలక వ్యాఖ్యలు చేశారు. నేను కుల, మత, రాజకీయాలు చేయనని, తాను ప్రజాపక్షం అని చెప్పారు. తనను అధికార పార్టీ ఏజెంటుగా కొందరు చెప్పడాన్ని ఆయన ఖండించారు. తాను ఎవరికీ ఏజెంటును కాదన్నారు. మరికొందరు నీ వెంట ఉండేదంతా యువతేనని, వారు నీకు ఓటు వేయరని చెబుతారని, కానీ ఎవరు ఏమన్నా తనది ప్రజాపక్షం అని చెప్పారు.

  కొన్ని పనులు కావాలంటే తగ్గాలి

  కొన్ని పనులు కావాలంటే తగ్గాలి

  నేను కొందరి తొత్తునని, ఏజెంటునని కొందరు విమర్శిస్తున్నారని, నేను అలా కనిపిస్తున్నానా అని ప్రశ్నించారు. కొన్ని సమస్యలు పరిష్కారం కావాలంటే కొంత తగ్గాల్సి ఉంటుందన్నారు. ప్రతి దానికీ ధర్నాలు, నిరసనలని రోడ్డెక్కితే నష్టపోయేది యువత, విద్యార్థులు, ప్రజలే అన్నారు. మీరంతా చదువుకోండని, మీ పనులు మీరు చేసుకోండని, మీ తరఫున నేను పోరాడుతానని చెప్పారు.

   జైల్లో పెట్టినా, దాడి చేసినా.. నన్ను 20 ఏళ్లుగా చూస్తున్నారు

  జైల్లో పెట్టినా, దాడి చేసినా.. నన్ను 20 ఏళ్లుగా చూస్తున్నారు

  నేను 2008 నుంచి రాజకీయాల్లో ఉన్నానని, ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొన్నానని, రాజకీయాల్లో ఉంటావా, పారిపోతావా అని కొందరు అంటుంటారని ఎన్నో ఒత్తిళ్లు తెచ్చే ప్రయత్నాలు చేస్తుంటారని, పదేళ్లు, పాతికేళ్లు జైళ్లో పెట్టినా సరే వెనక్కి తగ్గేది లేదని పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రతి దెబ్బకు రాటుదేలతానని, తనపై ఏ దాడులు జరిగినా భయపడనని, మీరంతా 20ఏళ్లుగా తనను చూస్తున్నారని, తాను ఎటువంటి వాడినో అందరికీ తెలుసునని చెప్పారు.

  మీరు ఓటేయకున్నా మీకోసమే పోరాటం

  మీరు ఓటేయకున్నా మీకోసమే పోరాటం

  మీ భవిష్యత్తు కోసం వచ్చానని, మీ వెంటే ఉంటానని, నమ్ముతున్న దాని కోసం ముందుకు సాగుతానని జనసేనాని అన్నారు. జనసేనకు ఓటేయాలని అడగనని, నేను పని చేసుకుంటూ పోతానని, నచ్చితే మీరే బలంగా ఓటేయండని, గెలిచినా, ఓడిపోయినా మీ కోసమే పని చేస్తానని, రాజకీయాల్లో ఎవరూ శత్రువులు కాదని, వారి పార్టీల విధానాలతో ఏకీభవించకపోవచ్చునని, అంతేగానీ వాటిని వ్యక్తిగతంగా తీసుకోనని చెప్పారు.

  రెయిన్ గన్స్ తాత్కాలిక ఉపశమనమేనని బాబుకు ఝలక్

  రెయిన్ గన్స్ తాత్కాలిక ఉపశమనమేనని బాబుకు ఝలక్

  వచ్చే 2019 ఎన్నికలు అనంతపురం జిల్లాకు ఎంతో కీలకమని, ఏళ్ల తరబడి ఉన్న ఇక్కడి కరవు, వలసలను శాశ్వతంగా తరిమికొట్టాల్సిన సంవత్సరమని, వీటిని దూరం చేస్తామనే వారికే ఓటేయాలని పవన్ అన్నారు. లేదంటే మరికొన్ని దశాబ్దాలు ఇదే పరిస్థితి కొనసాగుతుందన్నారు. ఇక్కడి కరవుకు శాశ్వత పరిష్కారం అవసరమన్నారు. రెయిన్ గన్స్‌ వంటివి ఏదో తాత్కాలిక ఉపశమనం కలిగిస్తాయే తప్ప, శాశ్వతంగా రైతులను ఆదుకోలేవని చంద్రబాబుకు చురకలు అంటించారు. ఈ జిల్లాకు ప్రత్యేకంగా వ్యవసాయ విధానం కావాలన్నారు. హంద్రీనీవా పథకం ఎంత త్వరగా పూర్తయితే, అంత మేలు జరుగుతోందని, ఎన్టీఆర్‌ హయాంలో మొదలైన ఈ పథకం ఇంకా పూర్తికాకపోవడం బాధాకరమన్నారు. దీనిని ఎలా త్వరగా పూర్తి చేయవచ్చనేది నీటిపారుదల నిపుణులతో చర్చించి, ఓ నివేదికను ప్రధాని మోడీకి అందజేస్తానని, దానిని అమలయ్యేలా చూస్తానని, జిల్లాకు విరివిగా పరిశ్రమలు రావాలని, విద్య, ఉపాధి అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉందన్నారు.

  English summary
  Telugudesam MLA Prabhakar Choudhary met Jana Sena chief Pawan Kalyan in his Anantapur three day tour.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X