అందుకే జగన్‌కు నష్టం, ఇంత దుర్మార్గపు ఆలోచనా?: పవన్‌ను ఏకిపారేసిన లక్ష్మీపార్వతి
అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి గురువారం తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆమె ఓ వెబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జనసేనానిపై విమర్శలు చేశారు.
పవన్ కళ్యాణ్ గురించి తాను చెప్పే దాని కంటే, రాజకీయ విశ్లేషకులు ప్రతిరోజూ బాగా చెబుతున్నారని వ్యాఖ్యానించారు. అసలు జనసేన పార్టీని ఎందుకు పెట్టారో, ఎందుకు రాజకీయాల్లోకి వస్తున్నారనే దానిపై ఆయనకే స్పష్టత లేదని ఎద్దేవా చేశారు.

ఇప్పటి వరకు చూస్తే ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలా
ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మలాగా ఉందని లక్ష్మీపార్వతి అన్నారు. జనసేన పెట్టకముందు, టీడీపీ పార్టీకి నరేంద్ర మోడీతో కలిసి పవన్ ప్రచారం చేశారని ఆమె అన్నారు. దీంతో తమ పార్టీ వైసీపీకి కొంత నష్టం జరిగిందని చెప్పారు.

కాపు ఓట్ల కోసం టీడీపీకి ఏజెంటులా
అప్పటి నుంచి నుంచి కాపు ఓట్ల కోసం పవన్ కళ్యాణ్‌ను ఓ ఏజెంట్‌గా తెలుగుదేశం పార్టీ వాడుకుంటోందని లక్ష్మీపార్వతి విమర్శలు గుప్పించారు. ఎవరైనా ఒక నేత సొంతంగా పార్టీ పెట్టాలంటే స్వతంత్రమైన అభిప్రాయాలతో ముందుకు రావాలని ఆమె అన్నారు. పవన్‌లో అలాంటి లక్షణాలు ఏవీ కనిపించలేదని చెప్పారు.

అలాంటి వారు సమాజాన్ని మారుస్తామని చెప్పడం ఎలా
స్వతంత్ర భావాలు లేనటువంటి వ్యక్తి సమాజాన్ని మారుస్తానని చెప్పడం అసాధ్యమని లక్ష్మీపార్వతి అన్నారు. ప్రజా వ్యతిరేకతకు పాల్పడుతున్న చంద్రబాబు వంటి వ్యక్తికి పవన్ మద్దతు పలకడం సబబు కాదని ఆమె అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను పవన్ చీలుస్తారని, దాని వల్ల ప్రతిపక్ష పార్టీకి నష్టం కలిగించాలనేది ఓ దుర్మార్గమైన ఆలోచన అన్నారు.
Recommended Video


పవన్ కళ్యాణ్ తీరు బ్రోకర్‌లా
పవన్ కళ్యాణ్ వ్యవహారం ఓ బ్రోకర్‌లా ఉంది తప్ప ప్రజలకు మంచి చేయాలని, న్యాయం చేయాలనే ఆలోచన కనిపించడం లేదని లక్ష్మీపార్వతి దుయ్యబట్టారు. ప్రజలకు న్యాయం చేసే పద్ధతి ఇది ఎంతమాత్రమూ కాదని ఆమె అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications