కొత్తగూడెంలో జనసేనానికి చేదు: ఓ వైపు సీఐ మరోవైపు ఏసీపీ, పవన్ 20 ని.లు ఏం చెప్పారో
ఖమ్మం: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఖమ్మం పర్యటన ఒకింత అసంతృప్తిని కలిగించింది. అభిమానుల అత్యుత్సాహం, ఆయన కాన్వాయ్ పైకి కొందరు దుండగులు చెప్పులు విసరడం జరిగాయి. ఓ వైపు ఆయనను అభిమానించే వారు పూలు కురిపించి రెడ్ కార్పెట్ పరిస్తే, వ్యతిరేకించే వారు ఎవరో ఒకరు చెప్పులు విసిరారు.
Recommended Video

హడావుడిగా వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్: కొత్తగూడెం.. జనసేనానికి 'మెగా' ఛాన్స్
ఖమ్మంలోని ఎంబీ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన పూర్వ ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లా కార్యకర్తల సమావేశంలోను పవన్‌కు ఓ విధంగా చేదు అనుభవం ఎదురైంది. అభిమానులు పదేపదే వేదిక పైకి దూసుకు వస్తుండటంతో విధిలేని పరిస్థితుల్లో పవన్ తన ప్రసంగం ముగించి వెళ్లవలసి వచ్చింది. నిర్వహణ లోపాల కారణంగా ఖమ్మంలో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి.
అలాంటి వ్యక్తులు: పవన్ కళ్యాణ్ రాజకీయాలపై నటుడు రానా కామెంట్స్

ఏర్పాట్లు చేయలేకపోయారు
పవన్ కళ్యాణ్ వస్తున్న సమయంలో చేయాల్సిన ఏర్పాట్లు స్థానిక నిర్వాహకులు చేయలేకపోయారని అంటున్నారు. దీంతో ఓ దశలో అదుపు తప్పింది. ఈ సమావేశానికి కార్యకర్తలు కూర్చునేందుకు వీలుగా కుర్చీలు వేశారు. ఎదురుగా ఉన్న వేదికకు ముందు రెండు మీటర్ల దూరంలో కార్యకర్తలను, వేదికను విభజిస్తూ బారికేడ్ ఏర్పాటు చేశారు.

అది తెలిసినా
పవన్ కళ్యాణ్‌ను చూడగానే అభిమానులు ఆయన కోసం ఎగబడతారనే విషయం తెలిసిందే. ఆయనతో కరచాలనం చేసేందుకు, అవసరమైతే సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఈ విషయం తెలిసినా నిర్వాహకులు బందోబస్తుతో కూడిన బారికేడు ఏర్పాటు చేయలేదని అంటున్నారు. దాంతో అది ఒకసారి కదిపితే విరిగిపోయింది.

పవన్ ప్రసంగంలో 20 నిమిషాలు ఏం తెలియలేదు
మీడియా ప్రతినిధులకు కేటాయించిన ప్రాంతంలోకి పెద్ద ఎత్తున వచ్చిన అభిమానులు తోసుకు వచ్చారు. పవన్ ప్రసంగంలో సుమారు ఇరవై నిమిషాలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. వేదిక దిగువన ఒకరినొకరు తోసుకుంటూ, తిట్టుకుంటూ దూసుకు వచ్చారు. పోలీసులు వారిస్తున్నా వినలేదు.

వేదిక కింద తోపులాటలో చిన్నారిని రక్షించిన పోలీసులు
కొందరు అభిమానులు వేదిక పైకి ఎక్కి పవన్ కళ్యాణ్‌తో కరచాలనం చేసేందుకు ప్రయత్నించారు. వేదిక కింద తోపులాటలో నలిగిపోతున్న ఓ చిన్నారిని పోలీసులు వేదిక మీదకు తీసుకు వచ్చి రక్షించారు. అభిమానుల అరుపులు, నిలువరించేందుకు వీలుకాని స్థితిలో సమావేశం కొనసాగింది. మూడు జిల్లాల కార్యకర్తల సమావేశం అన్నపుడు జనసేన కార్యకర్తలను మాత్రమే గార్డెన్‌లోనికి అనుమతించేలా నిర్వాహకులు చొరవ చూపలేకపోయారు.

ఫ్యాన్స్ దెబ్బతో తగ్గించుకున్న పవన్ కళ్యాణ్
కార్యకర్తలతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు రావడంతో గార్డెన్‌లోని కుర్చీలు విరిగిపోయాయి. అంతేకాదు, పవన్ కూడా తన ప్రసంగాన్ని కుదించుకునేలా చేసింది. పవన్ ప్రసంగం ఆద్యంతం జనసేన బాధ్యత పైన చేశారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడారు. కానీ నిర్వాహకులు సరిగా వ్యవహరించలేకపోవడం వల్ల పవన్ మరింత సేపు ప్రసంగించలేకపోయారని అంటున్నారు.

ఓ వైపు సీఐ, మరోవైపు ఏసీపీ
సమావేశం నిర్వాహకులు చేతులెత్తేయడంతో పోలీసులు అన్నీ తామై చర్యలు చేపట్టారు. డీసీపీ ఆధ్వర్యంలో ఖమ్మం ఏసీపీ, సీఐ తదితరులు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రయత్నించారు. వేదికకు ఓవైపు ఏసీపీ, మరోవైపు సీఐ ఉన్నారు. వేదిక మీదకు వచ్చిన ఇద్దరిని పక్కకు తీసుకువెళ్లారు. వేదిక చెంతకు వచ్చి ఎక్కేందుకు ప్రయత్నించిన వారిని నిలిపే ప్రయత్నం చేశారు. అయినా కొందరు దూసుకురావడంతో విధిలేని పరిస్థితిలో పవన్ తన ప్రసంగం ముగించి వెళ్లాల్సి వచ్చింది.