అదానీ పెట్టుబడులకు గండికొడుతున్న టీడీపీ ఎమ్మెల్యే-ఎంత పని చేశారంటే ?
ఏపీలో ఓవైపు అమరావతి రాజధాని సహా ఇతర ప్రాంతాల్లో, పలు రంగాల్లో భారీ పెట్టుబడులకు అదానీ గ్రూప్ సిద్ధమవుతోంది. మరోవైపు టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే ఒకరు ఈ ప్లాన్స్ అన్నింటికీ గండి కొట్టేలా వ్యవహరిస్తున్నారు. అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓ పోర్టు వద్ద హంగామా చేస్తూ పోర్టులోకి దూసుకుపోయారు. సిబ్బందిపై రెచ్చిపోయారు. మరోవైపు అదానీ గ్రూప్ పెట్టుబడులు కావాలంటూ ఆయన పార్టీ ప్రభుత్వం.. ఇప్పుడు అదే అదానీ చుట్టూ తిరుగుతోంది.
ఇంతకీ విషయం ఏంటంటే.. ఏపీలో అమరావతి రాజధానితో పాటు పలు చోట్ల భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అదానీ గ్రూప్ సిద్దమవుతోంది. ఈ మేరకు తాజాగా ఏపీ ప్రభుత్వం అదానీ గ్రూప్ ప్రతినిధులతో చర్చలు జరిపింది. దీంతో వారు పలు పోర్టులు, గనులు, అమరావతి రింగ్ రోడ్డు, ఐటీ, పర్యాటక రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు సూత్రప్రాయంగా అంగీకరించారు. దీంతో ఆయా రంగాల్లో వేల కోట్ల పెట్టుబడులతో పాటు భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా లభించబోతున్నాయి. ఇలాంటి సమయంలో టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రెచ్చిపోయారు.

కృష్ణపట్నం అదాని పోర్ట్ సిబ్బందిపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి దాడి.. రెడ్ బుక్ రాజ్యాంగంతో పారిశ్రామికవేత్తలను ఏపీకి రాకుండా భయపెడుతున్న @JaiTDP కూటమి గూండాలు#SadistChandraBabu#100DaysOfCBNSadistRule pic.twitter.com/Ts9cZD8o0I
— YSR Congress Party (@YSRCParty) October 28, 2024
నెల్లూరు జిల్లాలో అదానీ గ్రూప్ ఆధ్వర్యంలో నడుస్తున్న కృష్ణపట్నం పోర్టు వద్ద సోమిరెడ్డి హంగామా సృష్టించారు. పోర్టు లో కంటెయినర్ టెర్మినల్ ఎత్తివేస్తున్నారంటూ గతంలో హంగామా చేసిన సోమిరెడ్డి.. తాజాగా కృష్ణపట్నం పోర్టు వద్ద విధి నిర్వహణలో ఉన్న భద్రతా సిబ్బందిపై దాడికి ప్రయత్నించారు. తనిఖీలు లేకుండా తన మనుషులను పోర్టు లోపలికి పంపాలేదని కారణంతో సెక్యూరిటీ గార్డులపై దూషణలకు దిగారు. తమకే అడ్డు చెబుతారా అంటూ ఎమ్మెల్యే బండ బూతులు వారిని తిట్టారు. దీంతో ఈ వ్యవహారంపై అదానీ గ్రూప్ ఆరా తీస్తోంది.












Click it and Unblock the Notifications