ముంబాయి నటి కేసులో సిగ్గులేకుండా పని చేసిన ఐపీఎస్ లు, జీవీ
ముంబాయి సినీ నటి కాందబరీ జెత్వానీ కేసులో ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ పరువు మొత్తం పోయిందని వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముంబాయి నటి జత్వానీ విషయంలో వైసీపీ నాయకుల భజన చేస్తూ చట్టానికి, రాజ్యాంగానికి విరుద్ధంగా కొంత మంది అధికారులు పని చేశారని, ఆ ఐపీఎస్ అధికారులు దుర్మార్గంగా వ్యవహరించారని వినుకొండ టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మండిపడ్డారు.
వైసీపీ హయాంలో తాడేపల్లిలోని దొంగల బ్యాచ్ కోసం కొందరు పోలీసు అధికారులు సిగ్గులేకుండా పనిచేశారని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముంబాయి నటి జెత్వానీ వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున పోలీసు అధికారులు పీఎస్ఆర్ ఆంజనేయులు, విశాల్ గున్నీ, కాంతి రాణా టాటా ముగ్గురు అధికారులు ఐపీఎస్ శిక్షణలో ఏం నేర్చుకున్నారో అర్థం కావడం లేదని, బహుషా వాళ్లు ఐపీఎస్ శిక్షణ మరిచిపోయి వైసీపీ దగ్గర శిక్షణ తీసుకున్నట్లు ఉందని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మండిపడ్డారు.

ఓ ఆడపిల్లను వేధించడం కోసం ఇంత మంది ఐపీఎస్‌లు కలిసి పని చేయడం దారుణమని, పోలీసు ఉద్యోగాలు మానేసి వైసీపీ నాయకుల ఇళ్లల్లో వెట్టిచాకిరి చెయ్యడం వాళ్లకు సరిపోతుందని టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు. సమాజంలో ఇంత కన్నా ఘోరం ఇంకెక్కడైనా ఉంటుందా అంటూ టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు విచారం వ్యక్తం చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలనలో అడ్డగోలుగా పనిచేసిన ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి లాంటి వాళ్లను చూశామని, అలాంటి వారు కటకటాల పాలైనా ఇప్పుడు కూడా కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్‌ల్లో మార్పు రావడం లేదని టీడీపీ ఎమ్మెల్యే ఆంజనేయులు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముంబాయి నటి జత్వానీని వేధించేందుకు ఇంతమంది అధికారులు పనికట్టుకుని కుట్రపన్ని పని చేశారంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతోందని, ఈ పోలీసు అధికారుల వెనుక ఉన్న అసలు నిందితుల భాగోతాలు కూడా త్వరలో బయటకు వస్తాయని, ఆరోజులు దగ్గరలోనే ఉన్నాయని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు అన్నారు. ఇలాంటి దారుణాలకు ఎన్డీయే ప్రభుత్వంలో అవకాశం లేదని, మహిళలపై వేధింపుల విషయంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహిస్తుందని టీడీపీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications