టిడిపి మెలిక: 'జగన్ బెయిల్ రద్దు చేసుకుంటారా?', జగన్ కంపెనీలో ఇద్దరి చనిపోతే..

Posted By:
Subscribe to Oneindia Telugu

అమరావతి: అగ్రిగోల్డ్, నారాయణ పేపర్ లీకేజీ వంటి అంశాలపై సిబిఐ విచారణకు పట్టుబడుతున్న వైసిపి అధినేత వైయస్ జగన్‌పై టిడిపి నేతలు కూన రవి కుమార్, వంగలపూడి అనిత శుక్రవారం మండిపడ్డారు.

సిబిఐపై చాలా విశ్వాసం ఉన్నట్లు జగన్ మాట్లాడుతున్నారని కూన రవి విమర్శించారు. జగన్‌ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని సీబీఐ పిటిషన్ వేసిందని, సీబీఐని గౌరవిస్తూ జగన్‌ తన బెయిల్‌ను రద్దు చేసుకుంటారా అని నిలదీశారు.

సీబీఐపై అంటే అంత విశ్వాసం ఉన్నప్పుడు, ఆయన ఆస్తుల కేసులోను జగన్ బెయిల్ రద్దు చేయవద్దని పిటిషన్ వేయవద్దని కూన రవి అభిప్రాయపడ్డారు. అనేక రకాల మనస్తత్వాలు కలిగిన వ్యక్తి జగన్ అన్నారు.

కేబినెట్ లెక్క: ఏ జిల్లాలో ఎవరు ఇన్, ఎవరు ఔట్? వైసిపి నుంచి వీరే! ఎందుకంటే..

TDP MLAs Anitha lashes out at YS Jagan for his attitude in AP Assembly

ఆక్వా పరిశ్రమలను సముద్ర తీరంలో పెట్టమంటారని, సముద్ర తీరంలో వచ్చే పరిశ్రమలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.

కడపలో జగన్ కంపెనీ స్లాబు కూలి ఇద్దరు మృతి చెందితే, ఆయన సాయం కూడా చేయలేదని కూన రవి మండిపడ్డారు. జగన్ ప్రతి దానికి రాద్దాంతం చేస్తున్నారన్నారు. అక్వా బాధితులకు ప్రభుత్వం పరిహారం ఇస్తోందన్నారు. వైసిపి కుట్రపూరితంగా సభను అడ్డుకుంటోందన్నారు.

బ్లాక్‌మనీ, బ్లాక్‌మెయిలింగ్ ఇవే జగన్‌కు తెలిసినవి అంశాలు అని వంగలపూడి అనిత విమర్శించారు. తన ఒక్కడి కోసం మిగతా ఎమ్మెల్యేలను జగన్‌ ఇబ్బంది పెడుతున్నారన్నారు.

అసెంబ్లీలో ప్రశ్నలు వేసే అవకాశం కూడా రాకుండా జగన్‌ తమ హక్కులను కాలరాస్తున్నారని మండిపడ్డారు. పరిశ్రమ వర్గాలను భయపెట్టే విధంగా జగన్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

కాగా, ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు. శాసన సభ వాయిదా పర్వం కొనసాగుతోంది. మధ్యాహ్నం పన్నెండు గంటలకు మరోసారి సభ వాయిదా పడింది. అక్వా పరిశ్రమపై చర్చించాలని విపక్షాలు స్పీకర్ పోడియం వద్ద నిరసన తెలిపాయి. సభలో గందరగోళం చెలరేగటంతో స్పీకర్ కోడెల సభను వాయిదా వేశారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telugudesam Party MLAs Vangalapudi Anitha lashes out at YSRCP chief YS Jaganmohan Reddy for his attitude in AP Assembly.
Please Wait while comments are loading...