వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్ భయపడ్తున్నారని టీడీపీ, పార్క్ కోసం బీజేపీ (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రభుత్వానికి స్పీకర్‌ భయపడుతున్నారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర రావు, సండ్ర వెంకట వీరయ్యలు బుధవారం అన్నారు. స్పీకర్‌ గొంతుని ప్రభుత్వం నొక్కేస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి గూండాల తీరుపై గద్దర్‌, కోదండరాం‌, విమలక్క, అల్లం నాయాయణ లాంటివారు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఎమర్జెన్సీ రోజులు, రజాకార్ల పాలలను ప్రభుత్వం గుర్తుచోస్తోందని విమర్శించారు.

తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోయారని, ప్రభుత్వానికి 400 మంది మాత్రమే గుర్తుకు వచ్చారా? అని ప్రశ్నించారు. తాము కూడా తెలంగాణ ప్రజల ఓట్లతోనే గెలిచామన్నారు. ప్రజా సమస్యలను సభలో లేవనెత్తే బాధ్యత తమ పైన ఉందన్నారు. మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలను అడ్డుకోవడం సిగ్గుచేటు అన్నారు. పోలీసులు తమ పైన దాడి చేసినట్లుగానే భావిస్తామన్నారు.

ప్రభుత్వం తమ పైన దౌర్జన్యానికి దిగితే ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదన్నారు. తాము శవరాజకీయాలతో గెలవలేదని మండిపడ్డారు. కాగా, మీడియా పాయింట్ వద్ద తెలంగాణ టీడీపీ సభ్యులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక పరిస్థితి కనిపించింది. కాగా, తమ సస్పెన్షన్ సరికాదంటూ టీడీపీ సభ్యులు మంగళవారం సభాపతి చాంబర్ వద్ద నిరసన తెలిపారు.

తెలంగాణ టీడీపీ

తెలంగాణ టీడీపీ

తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మంగళవారం నాడు సభాపతి చాంబర్ వద్ద నిరసన తెలిపారు. తమను సస్పెండ్ చేయడం విడ్డూరమని వారు అన్నారు.

తెలంగాణ టీడీపీ

తెలంగాణ టీడీపీ

తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మంగళవారం నాడు సభాపతి చాంబర్ వద్ద నిరసన తెలిపారు. తమను సస్పెండ్ చేయడం విడ్డూరమని వారు అన్నారు.

బీజేపీ

బీజేపీ

వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం ఇందిరా పార్క్ స్థలంలో చెరువును తవ్విస్తామనే ప్రభుత్వ ప్రతిపాదనకు నిరసనగా మంగళవారం బీజేపీ శాసన సభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్ పాదయాత్ర చేశారు.

బీజేపీ

బీజేపీ

ఇందిరా పార్క్ బచావో అని రాసిన ప్లకార్డు పట్టుకొని ఆయన పార్క్ నుండి తెలంగాణ శాసన సభకు పాదయాత్రగా వచ్చారు. అంతకుముందు ఆయన ఇందిరా పార్క్ వాకర్స్ అసోసియేషన్, బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

బీజేపీ

బీజేపీ

హుస్సేన్ సాగర్ ప్రక్షాళణకు తాము వ్యతిరేకం కాదని, ఈ క్రమంలో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయకుండా నిరోధిస్తామనడం సరికాదన్నారు.

English summary
Ten Telangana TDP MLAs, who staged close to 12 hour sit in inside Speaker S Madhusudhana Chary’s chamber demanding action against the legislators, who had defected to the Telangana Rashtra Samithi, were evicted and sent to the NTR Trust Bhavan on Tuesday night.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X