వివేకా కేసు కోల్డ్ స్టోరేజ్ లోకే..! భారీ కుట్ర..! సుప్రీం నిర్ణయం వేళ బీటెక్ రవి షాకింగ్ ..!
ఏపీలో ఆరేళ్లుగా సంచలనాత్మకంగా మారిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిన్న సుప్రీంకోర్టులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. గతంలో వైసీపీ హయాంలో వివేకా హత్యకు ఆయన కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డే కారణమని, వారిని సీబీఐ ఎస్పీ రామ్ సింగ్ కాపాడుతున్నారంటూ ఈ ముగ్గురిపైనా పోలీసులు నమోదు చేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో పాటు ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా లేదా సీబీఐ చెప్పాలని ఆదేశించింది.
దీనిపై ఇవాళ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. సునీతకు గట్టి మద్దతుదారుగా ఉన్న బీటెక్ రవి నిన్న సుప్రీంకోర్టులో చోటు చేసుకున్న పరిణామాలతో వివేకా కేసు మరోసారి కోల్డ్ స్టోరేజ్ లోకి వెళ్లిందా అనే అనుమానం కలుగుతోందన్నారు. ఈ కేసుపై ఎలాంటి పురోగతి లేకపోవడంపై ప్రజాస్వామ్యవాదులు, అహింసావాదులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. నిర్ధ్యాక్షిణ్యంగా వివేకానందరెడ్డిని చంపినప్పటికి ఈ కేసును ఎందుకు తేల్చడంలేదనే అనుమానాలు ప్రజల్లో ఉన్నాయన్నారు. వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఈ కేసును త్వరగా తేల్చాలని అభ్యర్థిస్తున్నారని గుర్తుచేశారు.

వివేకా హత్య కేసులో సుప్రీం కోర్టు కాల పరిమితి విధించినందునే సీబీఐ ఎంక్వైరీ ఆగిపోయిందని సునీత లాయర్ సిద్ధార్థ లూద్రా చెబుతున్నారని, సుప్రీం కోర్టు కాలపరిమితిని సడలిస్తే ఎంక్వైరీ సజావుగా జరిగేందుకు అవకాశముందని అంటున్నారని గుర్తుచేశారు. కాబట్టి సుప్రీంకోర్టు ఈ గడువును సడలించాలన్నారు. ఈ హత్య కేసులోని ముద్దాయిలు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారని, సాక్ష్యులను బెదిరించడం, కేసు విషయంలో ప్రభావితం చేయడం చేస్తున్నారని ఆరోపించారు.

అయినా సునీత న్యాయపోరాటం చేస్తున్నారని, నిందితులు బయట తిరగడంతో ఈ కేసు పురోగతికి అడ్డంకిగా మారుతోందని బీటెక్ రవి ఆరోపించారు. వివేకా హత్య కేసు ముద్దాయిల బెయిల్ ను రద్దు చేయాలని సునీత కోరారన్నారు. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఈ కేసుకు కాలపరిమితి విధించడంతో సీబీఐ ఈ కేసు అయిపోయిందని మూసేసిందన్నారు. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు సీబీఐకి సూచించాలని ఆయన కోరారు. సునీత లాయర్ లూద్రా కూడా ఇదే అడుగుతున్నారన్నారు. సుప్రీం కోర్టు సీబీఐకి సూచిస్తే తప్ప వారు ఈ కేసును చేపట్టరన్నారు. ఇందులో భారీ కుట్ర ఉందన్నారు.
-
Tamil Nadu Election: రూటు మార్చిన విజయ్-సర్వేలు తేడా కొడుతున్న వేళ..! -
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..!












Click it and Unblock the Notifications