వివేకా హత్యపై సీబీఐకి షర్మిల ఫిర్యాదు ? కడప ఎంపీగా పోటీ చేసేలోగా! బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు

ఏపీలో మూడేళ్ల క్రితం సంచలనం రేపిన మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు అనేక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే నిందితులు ఎవరో దాదాపుగా కనిపెట్టేసిన సీబీఐ.. వారిని ఒక్కొక్కరిగా జైలుకు పంపుతోంది. వీరికి సుప్రీంకోర్టు కూడా తాజాగా బెయిల్ నిరాకరించింది. మరోవైపు వివేకా కుమార్తె సునీత కోర్టుల్ని ఆశ్రయించి విచారణ రాష్ట్రం బయట జరగాలని కోరుతున్నారు. ఈ సమయంలో సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల సీబీఐ డైరెక్టర్ ను కలిశారు. వీరి భేటీలో చర్చకు వచ్చిన అంశాలంటూ టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి నిన్న చిట్టా విప్పారు.

వివేకా హత్య కేసులో ట్విస్టులు

వివేకా హత్య కేసులో ట్విస్టులు

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇప్పటికే భారీ ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. దర్యాప్తు కీలక దశకు చేరుకుంటున్న దశలో దర్యాప్తు అధికారి రామ్ సింగ్ పైనే నిందితులు ఫిర్యాదులు చేస్తున్నారు. దీనిపై విచారణ జరగకుండా హైకోర్టు స్టే కూడా ఇచ్చింది. మరోవైపు అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదులుచేస్తూనే ఉన్నాడు. అదే సమయంలో రాష్ట్రంలో ఈ కేసు దర్యాప్తు జరిగితే తమకు న్యాయం జరగదంటూ వివేకా కుమార్తె సునీత కోర్టుల్ని ఆశ్రయిస్తున్నారు. ఇదే క్రమంలో ఆమె సోదరి వైఎస్ షర్మిల ఇప్పుడు ఇదే వ్యవహారంపై సీబీఐ డైరెక్టర్ కు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

సీబీఐ డైరెక్టర్ కు షర్మిల ఫిర్యాదు

సీబీఐ డైరెక్టర్ కు షర్మిల ఫిర్యాదు

తాజాగా తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అక్రమాలపై సీబీఐ డైరెక్టర్ కు వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో మరో కీలక అంశంపైనా ఆమె సీబీఐ డైరెక్టర్ కు ఫిర్యాదుతో కూడిన వాంగ్మూలం ఇచ్చినట్లు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ఆరోపించారు. ఆమె బాబాయ్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులతో పాటు అసలు ఈ హత్య వెనుక కారణాలు, అనంతర పరిణామాలపై షర్మిల సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు బీటెక్ రవి తాజాగా వెల్లడించారు. ఇందుకు తన వద్ద నిర్దిష్ట సమాచారం కూడా ఉందన్నారు. దీంతో వివేకా హత్య కేసులో సునీతకు తోడు ఇప్పుడు షర్మిల కూడా పోరాటం చేస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు

బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు


వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తాజాగా ఢిల్లీ వెళ్లినప్పుడు సీబీఐ డైరెక్టర్ ఆమె వాంగ్మూలం తీసుకున్నారని బీటెక్ రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఫిర్యాదుచేసేందుకు వెళ్లిన షర్మిల తన బాబాయ్ వివేకా హత్య గురించి కూడా ఫిర్యాదు చేశారని, దీంతో సీబీఐ డైరెక్టర్ ఆమె వాంగ్మూలం తీసుకున్నట్లు బీటెక్ రవి తెలిపారు. ఇందులో వివేకా హత్యకు దారి తీసిన పరిస్ధితులు, హత్యపై సీబీఐ జరుపుతున్న దర్యాప్తు సందర్భంగా చోటు చేసుకుంటూన్న పరిణామాలు, వైఎస్ కుటుంబ సభ్యుల పాత్రపై షర్మిల సమగ్రంగా వివరించారని బీటెక్ రవి ఆరోపిస్తున్నారు.

షర్మిల చెప్పిందిదేనన్న బీటెక్ రవి ?

షర్మిల చెప్పిందిదేనన్న బీటెక్ రవి ?

బీటెక్ రవి మాటల ప్రకారం చూస్తే వైఎస్ షర్మిల సీబీఐ డైరెక్టర్ కు చెప్పిన విషయాల్లో ముఖ్యంగా వివేకా హత్యకు దారితీసిన పరిస్ధితులున్నాయి. కడప ఎంపీగా తాను పోటీ చేయాలని వివేకా కోరుకున్నారని, అలాగే వివేకాను ఎమ్మెల్సీగా ఓడించడంలో ఆయన సోదరుడు వైఎస్ భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యుల పాత్ర ఉందని షర్మిల వాంగ్మూలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే వివేకా హత్యలో ఎవరిపై తనకు అనుమానాలున్నాయన్న ప్రశ్నకు ఇప్పటికే దస్తగిరి వాంగ్మూలంలో చెప్పిన అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి పాత్రలపై తనకు అనుమానం ఉందని షర్మిల తెలిపారు. అలాగే తాజాగా దస్తగిరికి తరచూ గన్ మెన్లను మార్చడం, తనకు ప్రాణహాని జరిగితే సీఎందే బాధ్యత అని చెప్పడం చూస్తే పరిస్ధితి ఎక్కడవరకూ వెళ్లిందో తెలుస్తోందని బీటెక్ రవి వెల్లడించారు. ఇదే పరిస్ధితి కొనసాగితే కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు ఎంతో దూరంలో లేదన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+