అచ్చెన్న, జేసీ అరెస్టులకు సంబంధం ? జగన్ వ్యూహం అదేనా- నిజం చెప్పేసిన టీడీపీ ఎమ్మెల్సీ..
టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, జేసీ ప్రభాకర్ రెడ్డిని ఒకరి తర్వాత ఒకరుగా అరెస్టు చేయడం వెనుక భారీ వ్యూహం దాగుందా ? బీసీ నేత అయిన అచ్చెన్నాయుడి అరెస్టుతో ప్రజల్లో వచ్చిన స్పందన చూశాక ప్రభుత్వం జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్టు చేయడం ద్వారా ఈ వ్యవహారంపై అందరి దృష్టీ మళ్లించాలని చూస్తోందని టీడీపీ చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. తద్వారా ఈ రెండు అరెస్టులకు లింక్ ఉందనేలా టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న చేసిన ట్వీట్ సంచలనం రేపింది.

అచ్చెన్న, జేసీ అరెస్టులకు లింక్ ?
టీడీపీకి చెందిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఈఎస్ఐ కుంభకోణంలో ఏసీబీ అరెస్టు చేయగా... బస్సుల అనుమతుల కోసం ఫోర్జరీ పత్రాలతో పాటు పలు అక్రమాలకు పాల్పడ్డారనే అరోపణలతో మరో నేత జేసీ ప్రభాకర్ రెడ్డిని రవాణాశాఖ అధికారులు అరెస్టు చేశారు. అయితే 24 గంటల వ్యవధిలోనే రెండు అరెస్టులు చోటు చేసుకోవడంతో టీడీపీ ఆత్మరక్షణలో పడింది. అయితే ఈ రెండు అరెస్టుల వెనుక ఏం జరిగిందనే అంశఁపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ట్విట్టర్ లో చేసిన తాజా వ్యాఖ్యలు ఈ వాదనకు బలం చేకూర్చేలా ఉన్నాయి.

బీసీల టార్గెట్ విమర్శలతో ....
ఈఎస్ఐ స్కాంలో అచ్చెన్నాయుడు అరెస్టుతో టీడీపీ నేతలు బీసీ గళాన్ని వినిపించడం మొదలుపెట్టారు. అచ్చెన్నాయుడుని అరెస్టు చేయడం ద్వారా జగన్ సర్కార్ బీసీలను టార్గెట్ చేసిందని, ఇందుకు నిరసనగా బీసీలు ఆందోళనలు చేపట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న పిలుపునిచ్చారు. దీంతో బీసీల్లో వ్యతిరేకత వచ్చిందని భావించిన వైసీపీ సర్కారు... జేసీ ప్రభాకర్ రెడ్డి అరెస్టుతో ఈ ఆరోపణలను పక్కదారి పట్టిస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా తన ట్వీట్ లో ఆరోపణలు చేశారు. దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారుతోంది.
Recommended Video

జగన్ వ్యూహం అదేనా ?
టీడీపీకి చెందిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు తర్వాత టీడీపీ బీసీ అస్త్రాన్ని ప్రయోగించింది. దీంతో అప్రమత్తమైన వైసీపీ నేతలు ఇది బీసీల మీద దాడి కాదని, అవినీతి ఆరోపణలపై అరెస్టు చేస్తుంటే బీసీ కార్డును అడ్డుపెట్టుకుంటున్నారని ఎదురుదాడి ప్రారంభించారు. అయితే ఈ కౌంటర్ రియాక్షన్ క్షేత్రస్ధాయిలో వర్కవుట్ అయిందా లేదా అన్న విషయాన్ని పక్కనబెడితే తాజా పరిణామాలు వైసీపీ వ్యూహాత్మక చర్యల్లో భాగమేనన్న వాదన వినిపిస్తోంది. ఒక రోజు వ్యవధిలో ఇద్దరు టీడీపీ నేతలపై సీరియస్ కేసులను ఫైల్ చేయడం, అరెస్టులకు దిగడం ద్వారా అసెంబ్లీ అజెండాను హైజాక్ చేయాలన్న ఆలోచన మాత్రం వైసీపీలో కనిపిస్తోందని చెబుతున్నారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications