• search
  • Live TV
ఒంగోలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

టీడీపీకి రాజీనామా చేసిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి: వైఎస్ఆర్ సీపీలో చేరడం లాంఛనమే

|

ఒంగోలు: ప్రకాశం జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆ పార్టీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని ఆయన పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావుకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. తాను పార్టీని వీడుతున్నానని, రాజీనామా పత్రాన్ని ఆమోదించాలని ఏకవాక్యంగా రాశారు. ఈ విషయాన్ని ఆయన ఒంగోలులో తన సొంత కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రకటించారు.

దీనితో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఇక లాంఛనప్రాయమే. ఆయన పార్టీలో చేరితే.. ఒంగోలు లోక్ సభ స్థానాన్ని కేటాయిస్తామని ఇదివరకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.

చిక్కుల్లో వైసిపి : బీజేపీతో రహస్య సంబంధాలు :టైమ్స్‌ నౌ స్టింగ్‌ ఆపరేషన్‌...!

TDP MLC Magunta Srinivasula Reddy quits Party

ప్రకాశం జిల్లాలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి బలమైన నాయకుడిగా పేరుంది. గతంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆయన ఒంగోలు నియోజకవర్గం నుంచి మూడుసార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. 2014 ఎన్నికల సమయంలో మాగుంట.. తెలుగుదేశం పార్టీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. అప్పటి ఎన్నికల్లో ఆయన టీడీపీ అభ్యర్థిగా ఒంగోలు నుంచి లోక్ సభకు పోటీ చేసి ఓడిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వైవీ సుబ్బారెడ్డితో చేతిలో మాగుంట ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయనకు టీడీపీ శాసన మండలికి పంపించింది.

కొంతకాలంగా ఆయన టీడీపీకి అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. పొరుగునే ఉన్న గుంటూరు జిల్లాకు చెందిన కమ్మ సామాజిక వర్గ నాయకుల జోక్యం ప్రకాశం జిల్లా టీడీపీలో అధికమైందంటూ ఆయన చెబుతూ వస్తున్నారు. ఇదే విషయాన్ని పార్టీ అగ్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ.. ఫలితం రాలేదని మాగుంట వర్గీయులు అంటున్నారు. దీనితో-పార్టీని వీడటమే మంచిదనే అభిప్రాయానికి వచ్చారు. ఒంగోలు లోక్ సభ స్థానాన్ని తనకు కేటాయించాలనే ఒకే ఒక్క షరతు పెట్టారని, దానికి వైఎస్ఆర్ సీపీ నాయకులు అంగీకరించారు. అంతేకాకుండా- పార్టీలోకి చేరడమంటూ జరిగితే.. మాగుంటకే ఒంగోలు లోక్ సభ స్థానం ఇస్తామని జగన్ అధికారికంగా వెల్లడించారు కూడా. దీనితో గురువారం ఆయన టీడీపీకి రాజీనామా చేశారు.

TDP MLC Magunta Srinivasula Reddy quits Party

బుజ్జగించిన చంద్రబాబు

రాజీనామా నిర్ణయాన్నిప్రకటించడానికి మాగుంట.. విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. పలుమార్లు బుజ్జగించినప్పటికీ.. ఆయన అంగీకరించలేదని చెబుతున్నారు. తాను రాజీనామా చేయడానికి గల కారణాలను ఇదివరకే చంద్రబాబును కలిసి వివరించినప్పటికీ.. ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదని, తీరా పార్టీని వీడే సమయంలో బుజ్జగించడం సరికాదని మాగుంట వర్గీయులు చెబుతున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

ఒంగోలు యుద్ధ క్షేత్రం
సంవత్సరం
అభ్యర్థి పేరు పార్టీ లెవెల్ ఓటు ఓటు రేట్ ఓట్ల తేడ
2019
మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైయస్సార్‌సీపీ విజేతలు 7,39,202 55% 2,14,851
శిద్ధా రాఘవరావు టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 5,24,351 39% 2,14,851
2014
వై.వి.సుబ్బారెడ్డి వైయస్సార్‌సీపీ విజేతలు 5,89,960 49% 15,658
మగుంటా శ్రీనివాసుల రెడ్డి టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 5,74,302 48% 0
2009
మగంట శ్రీనివాసలు రెడ్డి కాంగ్రెస్ విజేతలు 4,50,442 44% 78,523
మదుదూరి మలోకోండయ్య యాదవ్ టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,71,919 36% 0
2004
శ్రీనివాసుల రెడ్డి మగుంటా కాంగ్రెస్ విజేతలు 4,46,584 56% 1,06,021
బతుళా విజయా భారతి టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,40,563 43% 0
1999
కరణం బలరామ కృష్ణమూర్తి టీడీపీ విజేతలు 3,92,840 51% 21,948
శ్రీనివాసుల రెడ్డి మగుంటా కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,70,892 48% 0
1998
మగుంటా శ్రీనివాసుల రెడ్డి కాంగ్రెస్ విజేతలు 3,51,390 48% 20,866
రాజమోహన్ రెడ్డి మెకపతి టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,30,524 45% 0
1996
పర్వతమాంగ మగుంటా కాంగ్రెస్ విజేతలు 3,81,475 50% 50,060
రాజమోహన్ రెడ్డి ఎమ్ టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 3,31,415 44% 0
1991
మంగంట సుబ్బరమరెడ్డి కాంగ్రెస్ విజేతలు 3,29,913 50% 39,330
దేగా నరసింహ రెడ్డి టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,90,583 44% 0
1989
రాజమహన రెడ్డి మెకపతి కాంగ్రెస్ విజేతలు 3,96,282 56% 97,370
నారాయణస్వామి కటురి టీడీపీ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,98,912 42% 0
1984
బెజవాడ పాపరెడ్డి టీడీపీ విజేతలు 2,87,662 51% 18,143
వెంకటరెడ్డి పులి కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 2,69,519 48% 0
1980
వెంకట రెడ్డి పులి ఐ ఎన్సి( ఐ ) విజేతలు 2,66,831 57% 1,51,175
ఎ భక్తవత్సల రెడ్డి జేఎన్ పి రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 1,15,656 25% 0
1977
పులి వెంకట రెడ్డి కాంగ్రెస్ విజేతలు 2,52,206 56% 89,325
ముప్పవరాపు వెంకయ్య అలియాస్ వెంకయ్య నాయుడు బిఎల్డి రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 1,62,881 36% 0
1971
పి. అంకిందుడు ప్రసాద రావు కాంగ్రెస్ విజేతలు 2,84,597 71% 1,79,894
గోగినేని భారతి దేవి ఎస్డబ్ల్యుఎ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 1,04,703 26% 0
1967
కె జగ్గయ్య కాంగ్రెస్ విజేతలు 2,12,071 54% 80,458
ఎమ్ నారాయణస్వామి సి పిఎం రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 1,31,613 54% 0
1962
మదాల నారాయణస్వామి సీపీఐ విజేతలు 1,27,120 40% 2,343
టి.ఎస్ పాల్ కాంగ్రెస్ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 1,24,777 39% 0
1957
రోండా నరప రెడ్డి కాంగ్రెస్ విజేతలు 1,36,582 55% 24,619
మదాల నారాయణ స్వామి సీపీఐ రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థులు 1,11,963 45% 0

English summary
Former Lok Sabha Member, MLC Magunta Srinivasulu Reddy quit Telugu Desam Party. He sent his resign letter to State Party chief Kala Venkat Rao. He is ready to join in YSR Congress Party. He may get Ongole Lok Sabha ticket as YSR CP candidate for upcoming elections.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more