వైఎస్ జగన్ కు దమ్ముంటే ఆ విషయం పబ్లిక్ గా చెప్పాలి, రాంగోపాల్ రెడ్డి సవాల్

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని టార్గెట్ చేసిన పులివెందుల టీడీపీ నాయకుడు, ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పులివెందులలో ఫ్యాక్షన్ రాజకీయాలను పూర్తిగా ప్రోత్సహించింది వైఎస్ కుటుంబమే అని టీడీపీ ఎమ్మెల్యే రాంగోపాల్ రెడ్డి ధ్వజమెత్తారు అధికారం దూరం అయిన తరువాత వైఎస్ జగన్ ఇప్పుడు నీతులు చెబుతున్నారని రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు.

పులివెందులలోని నివాసంలో విలేకరులతో మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వైఎస్ జగన్ తో పాటు ఆయన కుటుంబం మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. 19978లో పులివెందులలో వైఎస్ కుటుంబ సభ్యులు రాజకీయం చెయ్యడం మొదలుపెట్టిన తరువాత రాయలసీమలో ఆ కుటుంబానికి ప్రత్యర్థులు అనే వాళ్లు లేకుండా చెయ్యాలని అనుకుని ఫ్యాక్షన్ రాజకీయాలు మొదలుపెట్టారని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు.

TDP MLC Rangopal Reddy has made sensational comments on former CM YS Jagan

పులివెందులతో పాటు రాయలసీమలో వైఎస్ కుటుంబానికి ఎదురు తిరిగిన అనేక మంది దారుణ హత్యలకు గురైనారని రాంగోపాల్ రెడ్డి ఆరోపించారు. ప్రత్యర్థులను హత్య చెయ్యడం, లేదంటే వారిని అరెస్టు చేసి జైలుకు పంపించడం వైఎస్ జగన్ కుటుంబ సభ్యులకు వెన్నతో పెట్టిన విద్య అని, ఇప్పటి వరకు వందలాది మంది వైఎస్ జగన్ బాధితులు జైల్లో ఉన్నారని టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ఆరోపిపంచారు.

రాజకీయ ప్రత్యర్థులను హత్యలు చెయ్యడం, వారి ఆస్తులు ధ్వంసం చెయ్యడం, దాడులు చెయ్యడం మీ కుటుంబానికి ఏమైనా కొత్తా అని టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మాజీ సీఎం వైఎస్ జగన్ ను ప్రశ్నించారు. గత శనివారం కడపలో వైఎస్ జగన్ పక్కనే సతీష్ రెడ్డి ఉన్నారని, ఆ సతీష్ రెడ్డికి తమ టీడీపీ పార్టీ నుంచి బీ. ఫారం ఇప్పించి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయించింది మేమే అని రాంగోపాల్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు అదే సతీష్ రెడ్డితో జగన్ శాంతమూర్తి అని, అహింసావాది అని చెప్పించగలరా అని టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వైసీపీ నాయకులకు సవాలు విసిరారు.

రాజకీయ చరిత్రలో తనలాంటి అహింసావాది, శాంతమూర్తిలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడా లేడు అనే విధంగా ఇటీవల కడప రిమ్స్ లో జగన్ మాట్లాడారని, ఎన్నికల తరువాత జగన్ ఇలా మాట్లాడటం చూసి తెలుగు ప్రజలు నవ్వుకుంటున్నారని టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వ్యంగంగా అన్నారు. హింసాత్మక సంఘటనల గురించి జగన్ మాట్లాడుతున్న మాటలు పచ్చి అపద్దం అని టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న నేరాలు, ఘోరాలకు తనకు సంబంధం లేదు అని వైఎస్ జగన్ గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పగలరా అని టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి సవాలు విసిరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+