రాజ్యసభలా రాష్ట్రాల్లో శాశ్వత మండలి.. రాజ్యాంగ సవరణకు టీడీపీ డిమాండ్.. జగన్‌కు చెక్ పడేలా..
''అసెంబ్లీలో భాగం కాబట్టి శాసన మండలి కూడా చట్టబద్దంగా వ్యవహరిస్తుందని నమ్మాం. కానీ ప్రజల ఓట్లతో గెలిచిన ప్రభుత్వం రూపొందించిన బిల్లుల్ని.. ఓడిపోయిన పార్టీ అడ్డుకోవడం చట్ట విరుద్ధం. ఇలా రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోన్న శాసన మండలి మనకు అవసరమా?'' అంటూ కౌన్సిల్ ఉనికినే ప్రశ్నిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గతంలో అసెంబ్లీలో చేసిన ప్రసంగం అందరకీ గుర్తుండే ఉంటుంది. ఆ తర్వాతి కాలంలో మండలి రద్దును అడుగడుగునా అడ్డుకున్న ప్రతిపక్ష టీడీపీ.. తాజాగా సరికొత్త వాదనను తెరపైకి తెచ్చింది. రద్దు కాదు కదా ఏకంగా కౌన్సిల్ కు శాశ్వతత్వం కల్పించాలని డిమాండ్ చేస్తున్నది.

దేశవ్యాప్త చర్చ..
‘‘అసెంబ్లీకి అది ఆరో వేలు లాంటింది.. కొనసాగినా.. రద్దయిపోయినా ఏమీకాదు'' అనే తరహా అభిప్రాయాలు శాసన మండలి విషయంలో మనం తరచూ వింటుంటాం. దేశంలో ప్రస్తుతానికి కేవలం ఆరు రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉండటం, ఏపీలో సైతం మొదట రద్దు చేసి, ఆ తర్వాత పునరుద్ధరించడం తెలిసిందే. కాగా, చట్టసభల్లో అప్పర్ హౌజ్ ఉండి తీరాల్సిందేనని, ఇప్పుడున్నట్లు అల్లాటప్పాగా కాకుండా శాశ్వత ప్రాతిపదికన దానిని మరింత బలోపేతం చేయాలని, ఆ మేరకు అవసరమైతే రాజ్యాంగ సవరణ కూడా తీసుకురావాలని టీడీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మండళ్లపై ఆయన చేసిన కామెంట్లను జాతీయ మీడియా సైతం ప్రముఖంగా ప్రచురించడం గమనార్హం.

జగన్ అభిప్రాయం తప్పు..
‘‘ఏపీలో ప్రభుత్వానికి శాసన మండలి పెద్ద అడ్డంకిలా మారిందని వైసీపీ నేతల్లో.. మరీ ముఖ్యంగా సీఎం జగన్ మనసులో గూడుకట్టుకుపోయిన అభిప్రాయం చాలా తప్పు. ప్రజాస్వామ్యంలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సరిగా ఉండాలంటే పెద్దల సభ అవసరం చాలా ఉంది. అందుకే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సైతం రాజ్యాంగంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. కానీ జగన్ కు రాజ్యాంగమన్నా, రూల్ ఆఫ్ లా అన్నా లెక్కలేదు. ప్రభుత్వం రూపొందించిన బిల్లును మండలి అడ్డుకుందంటే.. దాని వెనుక కచ్చితంగా ప్రజా ప్రయోజనాలు ఉన్నాయనే అర్థం చేసుకోవాలి''అని యనమల చెప్పుకొచ్చారు.

కేంద్రానికి డిమాండ్..
అమెరికా కాంగ్రెస్ లో హౌస్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్, సెనేట్ పేరుతో దిగువ, ఎగువ సభలున్నాయని, బ్రిటన్ లోనూ హౌస్ ఆఫ్ కామన్స్, హౌజ్ ఆఫ్ లార్ట్స్ పేర్లతో రెండు సభలున్నాయని, బ్రిటన్ వెస్ట్ మినిస్టర్ విధానాన్ని అనుసరిస్తూ భారత పార్లమెంటులో సైతం లోక్ సభ, రాజ్యసభలను ఏర్పాటు చేశారని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కొనసాగుతోన్న అదే విధానాన్ని రాష్ట్రాల్లోనూ కచ్చితంగా అమలు చేయాలని, రాజ్యసభ మాదిరిగానే శాసన మండళ్లకు కూడా శాశ్వతత్వం కల్పించేలా వెంటనే రాజ్యాంగ సవరణ చేయాలని యనమల కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Recommended Video

జగన్ సీఎం కావాలని జనం కోరలేదు..
‘‘అసెంబ్లీలో సంఖ్యా బలం ఉందికదాని సీఎం జగన్ ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మనమంతా చూస్తున్నాం. నిజానికి ఎన్నికల్లో వైసీపీకి దక్కిన ఓట్లు 47 శాతమే. టీడీపీకి 40 శాతం ఓట్లు పడ్డాయి. అంటే 50 శాతానికి పైగా ప్రజలు జగన్ ముఖ్యమత్రి కావాలని కోరుకోలేదు. టెక్నికల్ గా వాళ్లు 151 మెజార్టీ సీట్లు సాధించి ఉండొచ్చు. కానీ సగానికి పైగా ప్రజలు ఆయనను అంగీకరించలేదనే వాస్తవాన్ని జగన్ గుర్తుంచుకోవాలి. రాజ్యాంగ, రూల్స్ కు విరుద్ధంగా ఇష్టానుసారంగా వ్యవహరించే జగన్ లాంటివాళ్లకు ‘ప్రజాస్వామ్య నియంతలు' అనే పదం కరెక్టుగా సరిపోతుంది. అలాంటి వాళ్లకు చెక్ పెట్టాలంటే శాసన మండలిని పర్మనెంట్ గా ఉండాల్సిందే''అని యనమల విమర్శించారు.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications