పెట్రో ధరల్ని ఇలా తగ్గించండి-లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కీలక సూచన
దేశవ్యాప్తంగా చమురు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ప్రభుత్వాలు పన్నులు తగ్గించుకునేందుకు ఇష్టపడకపోవడంతో ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. అయినా ఎన్నికలు వచ్చినప్పుడు తగ్గించినట్లు నటించడం, ఆ తర్వాత మళ్లీ పెంచేయడం ప్రభుత్వాలకు అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలో ఇవాళ పార్లమెంటులో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ పెట్రో ధరల్ని నియంత్రించేందుకు ఓ సూచన చేశారు.
ఇవాళ లోక్ సభలో ధరల పెరుగుదలపై స్పీకర్ చర్చకు అనుమతిచ్చారు. దీంతో సభ్యులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. ఈ క్రమంలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కూడా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు కేంద్రానికి పలు సూచనలు చేశారు. స్వతహాగా పారిశ్రామికవేత్త అయిన జయదేవ్.. పెట్రో ధరల నియంత్రణకు ఓ సూచన చేశారు.

పెట్రోల్ , డీజిల్ ధరల ఎడతెగని పెరుగుదల ద్రవ్యోల్బణం వెనుక ప్రధాన కారణమని గల్లా కేంద్రానికి తెలిపారు. ఆహార పదార్థాల ధరల పెరుగుదల కారణంగా చిన్న రెస్టారెంట్లు, వ్యాపారాలు గందరగోళంలో ఉన్నాయన్నారు.
అనంతరం గల్లా జయదేవ్.. ద్రవ్యోల్బణానికి కొత్త అర్ధం చెప్పారు. ద్రవ్యోల్బణం అంటే చట్టం లేకుండా పన్ను విధించడం తప్ప మరొకటి కాదన్నారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి చర్చలో పాల్గొనాల్సిందిగా వినియోగదారుల వ్యవహారాల మంత్రిని ఎంపీ గల్లా అభ్యర్థించారు. పెట్రోలు, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, ఇంధన ధరల పెరుగుదలను నియంత్రించాలని గల్లా కేంద్రానికి సూచించారు.












Click it and Unblock the Notifications