వైసీపీ వైపు మరో టీడీపీ ఎంపీ చూపు - ఆ వర్గం నేతలపై గురి..!!
ఏపీలో ఎన్నికల వేళ జంపింగ్స్ మొదలయ్యాయి. వైసీపీలో టికెట్లు దక్కని వారు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. దీనికి వైసీపీ కౌంటర్ గేమ్ ప్రారంభించింది. టీడీపీ సిట్టింగ్ ఎంపీలు.. ఆ పార్టీకి ప్రధానంగా అండగా నిలిచే సామాజిక వర్గ నేతలను ట్రాప్ చేస్తోంది. తాజాగా విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరుతున్నట్లు ప్రకటించారు. రాజకీయాలకు దూరం అవుతన్నారని భావిస్తున్న వేళ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తో వైసీపీ నేతల భేటీతో ఇప్పుడు ఆసక్తి కర చర్చ మొదలైంది.
Recommended Video

పార్టీల జంపింగ్స్: ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నుంచి జంపింగ్స్ పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ తన పార్టీ ఇంఛార్జ్ లను అవసరమైన నియోజకవర్గాల్లో మారుస్తున్నారు. దాదాపు 60 నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులకు నిర్ణయించారు. ఈ క్రమంలో మూడో జాబితా ఈ రోజు ప్రకటించనున్నారు. అటు టీడీపీ నుంచి వైసీపీలో వలసలు మొదలయ్యాయి.

టీడీపీకి బలమైన నియోజకవర్గాల్లో..ప్రధానంగా అండగా నిలుస్తున్న సామాజిక వర్గానికి చెందిన నేతల పైన వైసీపీ గురి పెట్టింది. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీకి, ఎంపీ పదవికి రాజీనామా చేసారు. సీఎం జగన్ ను కలిసారు. తన రాజీనామా ఆమోదం పొందగానే వైసీపీలో చేరుతానని ప్రకటించారు. చంద్రబాబు పైన కీలక వ్యాఖ్యలు చేసారు.
వైసీపీ నేతలతో భేటీ: ఇది విజయవాడ రాజకీయాల్లో ఎన్నికల వేళ అనూహ్య మలుపుగా మారుతోంది. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీ 60 శాతం ఖాళీ అవుతుందని నాని చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచనలంగా మారాయి. ఇదే సమయంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ వైసీపీకి చెందిన ముఖ్య నేత చెవిరెడ్డితో సమావేశమయ్యారని..పార్టీ మార్పు దిశగా చర్చ జరుగుతోందనే వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతున్నాయి.
దీని పైన రెండు వైపులా ఎలాంటి అధికారిక స్పందన ఇప్పటి వరకు లేదు. గుంటూరు నుంచి 2014,2019 ఎన్నికల్లో వరుసగా ఎంపీగా గెలిచిన జయదేవ్ కొంత కాలంగా నియోజకవర్గానికి పూర్తిగా దూరంగా ఉంటున్నారు. తాజాగా తెలంగాణలో తన వ్యాపారాన్ని విస్తరించే క్రమంలో బిజీగా ఉంటున్నారు. పార్లమెంట్ సమావేశాలకు మాత్రం హాజరవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జయదేవ్ పోటీ చేయటం లేదని ఆయన వర్గీయులు చెబుతున్నారు.

టీడీపీని వీడుతున్నారా: జయదేవ్ రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించారని..సంక్రాంతి తరువాత మద్దతు దారులతో సమావేశం ఏర్పాటు చేసి అక్కడే తన నిర్ణయం ప్రకటిస్తారని తెలుస్తోంది. ఈ సమయంలో ఈ భేటీ గురించి చర్చ మొదలైంది.గల్లా జయదేవ్ తాజాగా వైసీపీ ముఖ్య నేత చెవిరెడ్డితో భేటీ అయ్యారని తెలుస్తోంది. గల్లా కుటుంబానిది చంద్రగిరి సొంత నియోజకవర్గం. ఆ నియోజకవర్గానికి చెందిన చెవిరెడ్డితో జయదేవ్ భేటీ వెను అంతర్యం ఏంటనేది ఇప్పుడు రాజకీయ చర్చగా మారింది.
ఇదే సమయంలో ఒకటి, రెండు రోజుల్లో జయదేవ్ సీఎం జగన్ తో సమావేశం కానున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. దీంతో టీడీపీకి చెందిన ముఖ్య నేతలను తమ వైపు తిప్పుకొనేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తుందనే వాదన వినిపిస్తోంది. దీంతో..జయదేవ్ రాజకీయంగా తన నిర్ణయం మార్చుకుంటారా లేదా రాజకీయాలకే దూరంగా ఉంటారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications