ప్రధాని కాళ్లు పట్టుకోవాల్సిన ఖర్మ చంద్రబాబుకు పట్టలేదు: జెసి
అనంతపురం: అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి మరోసారి సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నిధులు ఇవ్వాలనుకుంటే ఇస్తుందని అంతే తప్ప ప్రధాని కాళ్లు పట్టుకొని తెచ్చుకోవాల్సినంత ఖర్మ చంద్రబాబుకు పట్టలేదని జెసి వ్యాఖ్యానించారు.
Recommended Video

JC Diwakar Reddy Warns PM modi

అసలు చంద్రబాబునాయుడు అంటే ఏమనుకున్నారు. ఆయన ఒక బ్రాండ్...అలాంటిది ఆయన కేంద్రానికి సాగిలాపడాలా ...ఏంటి? మాకు ఆ అవసరం లేదు. ప్రధాని ఇవ్వాలనుకుంటే నిధులు ఇస్తారు..అలా ఇవ్వాల్సిన బాధ్యత ఆయనపై ఉందని జెసి దివాకర్ అన్నారు.ఏకంగా ప్రధానిని ఉద్దేశిస్తూ ఎంపి జెసి మాట్లాడిన మాటలు కలకలం రేపుతున్నాయి.












Click it and Unblock the Notifications