ఎయిర్‌లైన్స్ నిషేధం: హైకోర్టును ఆశ్రయించిన జేసీ దివాకర్ రెడ్డి
హైదరాబాద్: తెలుగుదేశం పార్లమెంటుసభ్యుడు జేసీ దివాకర్‌రెడ్డి మంగళవారం హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎయిర్‌లైన్స్ సంస్థలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.
మరో బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రార్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ సిబ్బందితో దురుసుగా ప్రవర్తించిన జేసీపై 8 ఎయిర్ లైన్స్ సంస్థలు నిషేధం విధించిన సంగతి విదితమే.

అంతేగాక, ఇటీవల హైదరాబాద్ విమానాశ్రాయానికి వచ్చిన ఎంపీ దివాకర్ రెడ్డికి రెండు విమానాల సిబ్బంది అనుమతించకపోవడంతో వెనుదిరిగిపోయారు. నిషేధం ఉన్నందున తాము విమానాల్లోకి అనుమతించలేమని ఎంపీకి సదరు విమాన సంస్థలు స్పష్టం చేయడం గమనార్హం.












Click it and Unblock the Notifications