టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలనం-షిండేలా సీఎం రమేష్-అధికారం కష్టమే-ఇంట్రస్ట్ లేదు
కొంతకాలంగా టీడీపీలో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా కనిపిస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని తరచుగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ముఖ్యంగా అధినేత చంద్రబాబుతో పాటు ఆయన చుట్టూ ఉన్నకోటరీపై కేశినేని వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.ఇదే క్రమంలో ఇవాళ ఢిల్లీలో మీడియాతో ఆఫ్ ద రికార్డ్ లో మాట్లాడిన కే్శినేని మరోసారి సంచలనం రేపారు.
టీడీపీలో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలపై ఇవాళ ఢిల్లీలో మీడియాతో ఆఫ్ ద రికార్డ్ లో మాట్లాడిన కేశినేని నాని.. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే ఎపిసోడ్ తో వాటిని పోల్చారు. మహారాష్ట్ర లో ఏక్ నాథ్ షిండేలా టీడీపీలో బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉన్నాడంటూ కేశినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో 50, 60 సీట్లు టీడీపీకి వస్తే ఏక్ నాథ్ షిండే లా సీఎం రమేష్ తో ఆపరేషన్ చేస్తారంటూ మరో సంచలనం రేపారు.

అంతటితో ఆగకుండా కేశినేని నాని మరిన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ అధికారంలోకి రాదని ఆయన వ్యాఖ్యానించారు. గెలిచే శక్తి, యుక్తి చంద్రబాబుకు లేదన్నారు. ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళ మాటలు చంద్రబాబు నమ్మరని కేశినేని వ్యాఖ్యానించారు. బ్రోకర్లు, లోఫర్ల మాటలే చంద్రబాబు వింటారని విజయవాడ ఎంపీ తెలిపారు. నాకు రాజకీయాల్లో కొనసాగాలనే ఇంట్రస్ట్ లేదన్నారు.












Click it and Unblock the Notifications