మురళీమోహన్ సెక్సిస్ట్ వ్యాఖ్యలు: లేడీ ఎంపీల నిరసన
న్యూఢిల్లీ: మహిళ వస్త్రధారణపై తెలుగుదేశం పార్టీ లోకసభ సభ్యుడు మురళీమోహన్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. మహిళలు హుందాగా వస్త్రధారణ చేసుకోవాలని ఆయన గురువారం లోకసభలో అన్నారు. దాంతో తీవ్ర నిరసన వ్యక్తమైంది.
మురళీ మోహన్ వ్యాఖ్యలపై బిజెపి సభ్యులు మౌనంగా ఉన్నప్పటికీ ఇతర పార్టీల సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. దేశంలో మహిళలు, పిల్లలపై జరుగుతున్న దారుణాలపై లోకసభలో చర్చ సందర్భంగా మురళీమోహన్ ఆ వ్యాఖ్యలు చేశారు.

రాసుకున్న ప్రసంగ ప్రతిని ఆయన చదివారు. భారత సంప్రదాయాలను కాపాడడానికి, హుందాగా దుస్తులు ధరించాలని తన సోదరీమణులను, కూతుళ్లను అమ్మాయిలను కోరుతున్నానని మురళీ మోహన్ అన్నారు. ఆయన వ్యాఖ్యలు మోరల్ పోలీసింగ్ అంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి.
మురళీ మోహన్ వ్యాఖ్యలపై కాంగ్రెసు ఎంపీలు సుస్మితా దేవ్, రంజీత్ రంజన్, ఎన్సీపి ఎంపి సుప్రియా సూలే తీవ్ర అభ్యంతరం చెప్పారు. అనుకోని విధంగా మురళీమోహన్ ప్రసంగానికి అభ్యంతరం వ్యక్తమైన స్థితిలో పక్కనే ఉన్న మరో తెలుగుదేశం సభ్యుడు జయదేవ్ గల్లా నవ్వడం కనిపించింది. చెప్పడానికి మురళీ మోహన్ వద్ద మరో ప్రత్యేకమైన విషయం లేదా అని రంజన్ అడిగారు.












Click it and Unblock the Notifications