ఉభయసభల్లో టిడిపి ఎంపీల బైఠాయింపు: బయటకు పంపిన మార్షల్స్

న్యూఢిల్లీ: ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో రాజ్యసభలో టిడిపి ఎంపీలు నిరసనను కొనసాగిస్తున్నారు. రాజ్యసభ వాయిదా పడిన తర్వాత కూడ టిడిపి ఎంపీలు రాజ్య,సభలోనే బైఠాయించారు.సభ నుండి బయటకు రావాలని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ కురియన్, కేంద్ర మంత్రి విజయ్ గోయల్ టిడిపి ఎంపీలను కోరినా కానీ, కేంద్రం నుండి ప్రత్యేక హోదా విషయమై స్పష్టమైన హమీ వచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని టిడిపి ఎంపీలు ప్రకటించారు.రాజ్యసభలో నిరసన కొనసాగిస్తున్న టిడిపి ఎంపీలకు మద్దతుగా పార్లమెంట్ సెంట్రల్ హల్‌లో టిడిపి ఎంపీలు పార్లమెంట్ సెంట్రల్ హల్‌లో నిరసనకు దిగారు. టిడిపి ఎంపీ అవంతి శ్రీనివాస్ అస్వస్థతకు గురికావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారు.

గురువారం నాడు కూడ పార్లమెంట్ ఉభయసభల్లో కూడ అదే వాతావరణం కన్పించింది. అన్నాడిఎంకె ఎంపీల ఆందోళనలతో పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడ్డాయి. రాజ్యసభ వాయిదా పడిన తర్వాత టిడిపి ఎంపీలు రాజ్యసభలోనే అలాగే బైఠాయించారు. రాజ్యసభలోనే టిడిపికి చెందిన ఎంపీలు కూర్చొన్నారు. సభలోనే ఉన్నారు.

విషయం తెలుసుకొన్న రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ కురియన్ టిడిపి ఎంపీలతో చర్చించారు. నిరసనను విరమించాలని కురియన్ వారిని కోరారు. అయితే తమ డిమాండ్లపై కేంద్రం స్పష్టమైన హమీ ఇచ్చే వరకు ఆందోళనను కొనసాగిస్తామని ప్రకటించారు. కేంద్ర మంత్రి విజయ్‌గోయల్ కూడ టిడిపి ఎంపీలతో చర్చించారు. కానీ, టిడిపి ఎంపీలు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు.

TDP MPs continues their protest in Rajya Sabha

లోక్‌సభ నిరవధిక వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించిన వెంటనే వైసీపీ ఎంపీలు తమ ఎంపీ పదవులకు రాజీనామాలు చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. అంతేకాదు ఏపీ భవన్ వేదికగా ఆమరణనిరహరదీక్షకు కూడ వైసీపీ ఎంపీలు సిద్దమయ్యారు. ఈ తరుణంలోనే టిడిపి ఎంపీలు రాజ్యసభ వాయిదా పడినా , సభలోనే బైఠాయించి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

ఏపీ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హమీలను నెరవేర్చాలని కోరుతున్నారు. ఈ విషయమై కేంద్రం నుండి స్పష్టమైన హమీ ఇచ్చే వరకు తాము సభలోనే ఉంటామని టిడిపి ఎంపీలు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ కురియన్‌కు చెప్పారు.

రాజ్యసభ వాయిదా పడిన తర్వాత కూడా తెదేపా సభ్యులు సభలోనే కూర్చుని ప్లకార్డులతో నిరసన తెలిపారు. తెదేపా సభ్యులు సుజనాచౌదరి, సీఎం రమేష్‌, గరికపాటి మోహనరావు, కనకమేడల రవీంద్రకుమార్‌, సీతారామలక్ష్మిని సభ నుంచి బయటకు తీసుకొచ్చేందుకు రాజ్యసభ సిబ్బంది, మార్షల్స్‌ ప్రయత్నిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు వచ్చేది లేదని తెదేపా ఎంపీలు స్పష్టం చేయడంతో ఉద్రిక్తత కొనసాగుతోంది.

శుక్రవారం రోజు రాష్ట్రపతిని కలవాలని టిడిపి ఎంపీలు భావిస్తున్నారు. రాజ్యసభలో ఆందోళన చేస్తున్న టీడీపీ ఎంపీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.. టీడీపీ ఎంపీల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

ఇదిలా ఉంటే రాజ్యసభలో టిడిపి ఎంపీల నిరసనకు సంఘీభావంగా పార్లమెంట్ సెంట్రల్ హల్ లో టిడిపి లోక్‌సభ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. . నిరసన కొనసాగిస్తున్న టిడిపి ఎంపీ ఆవంతి శ్రీనివాస్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అవంతి శ్రీనివాస్ కు బీపీ పడిపోయింది. దీంతో ఆయనను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.

రాజ్యసభలో నిరసనను కొనసాగిస్తున్న టిడిపి ఎంపీలను గురువారం రాత్రి 9 గంటల సమయంలో మార్షల్స్ బయటకు పంపారు. పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో ధర్నా చేపట్టగా వారిని ఎట్టకేలకు వారిని కూడ సిబ్బంది మార్షల్స్ సాయంతో బయటకు తీసుకొచ్చారు.

ఈ నేపథ్యంలో పార్లమెంటు వెలుపల టీడీపీ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్ మాట్లాడారు.. పార్లమెంటులో అన్నాడీఎంకేతో నిరసనలు తెలిపేలా చేసి, అవిశ్వాస తీర్మానంపై చర్చ జరపకుండా బీజేపీ కుట్ర పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తీరును నిరసిస్తూ తాము రాజ్యసభలో కూర్చుంటే మార్షల్స్ సాయంతో బలవంతంగా పశువులను లాక్కొచ్చినట్లు బయటకు తీసుకొచ్చారని అన్నారు.

కేంద్రం అనుసరిస్తున్నతీరును ప్రజలు గమనిస్తున్నారని టిడిపి ఎంపీలు అభిప్రాయపడ్డారు. తమ పోరాటం ఆగదని, రేపు త‌మ పోరాటాన్ని మరింత తీవ్ర‌త‌రం చేస్తామ‌ని చెప్పారు. స‌భ్యుల పట్ల గౌర‌వం లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని మండిప‌డ్డారు.పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో కళ్లు తిరిగిపడిపోయిన టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్‌ను రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో టిడిపి ఎంపీలు పరామర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+