పార్లమెంట్ గేట్-1 వద్ద టిడిపి ఎంపీల నిరసన, ఆసుపత్రికి మురళీ మోహన్
న్యూఢిల్లీ: లోక్ సభ వాయిదా పడిన తర్వాత స్పీకర్ ఛాంబర్‌లోనే నిరసనను కొనసాగించిన టిడిపి ఎంపీలను మార్షల్స్ శుక్రవారం సాయంత్రం బయటకు తీసుకొచ్చారు. పార్లమెంట్ గేట్ 1 వద్దే ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని టిడిపి ఎంపీలు డిమాండ్ చేస్తూ తమ నిరసనను కొనసాగిస్తున్నారు. మరో వైపు టిడిపి ఎంపీ మురళీమోహన్‌కు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనే డిమాండ్‌తో శుక్రవారం నాడు పార్లమెంట్ వాయిదా పడిన తర్వాత లోక్‌సభ స్పీకర్ ఛాంబర్‌లోనే టిడిపి ఎంపీలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు నిరసన వ్యక్తం చేస్తున్న టిడిపి ఎంపీలతో స్పీకర్ వ్యక్తిగత సిబ్బంది, లోక్‌సభ స్పీకర్ కార్యాలయం పలు మార్లు చర్చలు జరిపింది.
అయితే తమ డిమాండ్లపై కేంద్రం నుండి స్పష్టమైన హమీ వస్తేనే తాము నిరసనలను విరమిస్తామని టిడిపి ఎంపీలు తేల్చి చెప్పారు.ఈ కారణంగానే టిడిపి ఎంపీలను శుక్రవారం సాయంత్రం టిడిపి ఎంపీలను మార్షల్స్ స్పీకర్ ఛాంబర్ నుండి బయలకు తీసుకొచ్చారు.

ఇదిలా ఉంటే పార్లమెంట్ వాయిదా పడిన తర్వాత స్పీకర్ చాంబర్లోనే దీక్షను కొనసాగించారు.శుక్రవారం సాయంత్రం మార్షల్స్ టిడిపి ఎంపీలను లోక్‌సభ బయట నుండి తీసుకొచ్చారు.
పార్లమెంట్ గేట్ 1 వద్ద ఎంపీలను వదిలేశారు. అక్కడే బైఠాయించి టిడిపి ఎంపీలు నిరసనను కొనసాగిస్తున్నారు. పార్లమెంట్ బయటకు టిడిపి ఎంపీలను తీసుకొచ్చిన తర్వాత టిడిపి ఎంపీ మురళీమోహన్ కళ్ళు తిరిగి కిందపడిపోయాడు.
గురువారం నాడు కూడ పార్లమెంట్ ఉభయ సభలు వాయిదా పడిన తర్వాత రాజ్యసభలో టిడిపి ఎంపీలు సభలోనే ఉండి తమ నిరసనను కొనసాగించారు. మరోవైపు రాజ్యసభలో ఎంపీల దీక్షకు మద్దతుగా పార్లమెంట్ సెంట్రల్ హల్ లో లోక్‌సభ ఎంపీలు కూడ బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
గురువారం రాత్రి పూట మార్షల్స్ సహయంతో పార్లమెంట్ ఉభయ సభల నుండి టిడిపి ఎంపీలను బయటకు పంపారు.గురువారం దీక్ష సందర్భంగా టిడిపి ఎంపీ అవంతి శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు.
ఏపీకి జరిగిన అన్యాయంపై తాము పోరాటం చేస్తోంటే ఏ ఒక్కరూ కూడ తమ మాట వినడం లేదని టిడిపి ఎంపీ రామ్మోహన్ నానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం స్పందిచడం లేదని, కనీసం, లోక్ సభ స్పీకర్ కూడా తమ మాట వినడం లేదనిన్నారు. రెండు నిమిషాల సమయం కూడా కేటాయించడం లేదని విమర్శించారు.
స్పీకర్ తమకుసమాధానమివ్వాలంటూ ఆమె ఛాంబర్ లో నిరసన తెలియజేస్తుంటే, మార్షల్స్ వచ్చి తమను బలవంతంగా అక్కడి నుంచి బయటకు తీసుకువచ్చారని మండిపడ్డారు.
'మేము పార్లమెంట్ సభ్యులం కాదా? ఏపీ సమస్యలను ఇక్కడ చెప్పే అవకాశం మాకు లేదా? 29 రోజుల నుంచి మేము పోరాడుతుంటే ఎవరూ పట్టించుకోవట్లేదు' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications