తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈసీకి టీడీపీ ఎంపీల ఫిర్యాదు- చంద్రబాబుపై రాళ్లదాడి- వాలంటీర్ల పాత్రపైనా

|
Google Oneindia TeluguNews

తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై నిన్న జరిగిన రాళ్ల దాడిపై ఆ పార్టీ ఎంపీలు ఇవాళ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో పాటు తిరుపతి ఉపఎన్నికల నిర్వహణపైనా ఈసీకి పలు ఫిర్యాదులు చేశారు. తిరుపతి ఉపఎన్నికలో వాలంటీర్ల పాత్ర లేకుండా చూడాలని కోరారు.

గ్లామర్ డోస్ పెంచిన సోనమ్ చౌహన్

తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో ఉన్న చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడిపై ఇవాళ డిల్లీలో సీఈసీని కలిసిన టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌ నాయుడు, కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా తిరుపతి ఉపఎన్నికల సందర్భంగా చోటు చేసుకుంటున్న పలు పరిణామాలను వారు ఈసీ దృష్టికి తెచ్చారు. తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్ల పాత్ర లేకుండా చూడాలని ఎంపీలు సీఈసీని కోరారు. పోలింగ్‌ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కూడా వారు ఈసీని కోరారు. తిరుపతి పరిదిలో 2 లక్షల నకిలీ ఓటరు కార్డులు ఉన్నాయని పిర్యాదు చేశారు. 2 అదనపు కార్డులుంటేనే ఓటేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. పోలింగ్‌ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లను నియమించాలని కూడా కోరారు.

tdp mps complain ec over attack on chandrababu, ask to restrict volunteers from bypoll

ఈసీతో భేటీ తర్వాత మాట్లాడిన టీడీపీ ఎంపీలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రశ్నించే ప్రజా గొంతును జగన్‌ రెడ్డి నులిమే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబుపై తిరుపతిలో రాళ్ల దాడిని వారు ఖండించారు. టీడీపీకి వస్తున్న ప్రజాదరణ చూసి వైసీపీ నేతలకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఎంపీలు తెలిపారు. దాడులు, దౌర్జన్యాలు వైసీపీ డీఎన్ఏ లోనే ఉన్నాయన్నారు.

బాబాయ్ హత్య కేసులో టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాల్ ను స్వీకరించలేక పారిపోయారని, కేవలం రెండేళ్లకే వైసీపీ అరాచకపు, మోసపూరిత పాలన ప్రజలకు అర్ధమయ్యిందని టీడీపీ ఎంపీలు తెలిపారు. రాష్ట్రంలో రౌడీలు, గూండాలు రాజ్యమేలుతున్నారు. ప్రజాక్షేత్రంలో ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకతను పక్కదారి పట్టించేందుకు ప్రతిపక్షపాలపై దాడులకు దిగుతున్నారని విమర్శించారు.. జగన్మోహన్ రెడ్డి ఎన్ని కుట్రలు వేసినా తిరుపతిలో తెలుగుదేశం విజయాన్ని ఆపలేరన్నారు.

English summary
telugu desam party mps on today complains election commission of india in new delhi over stone attack on their party chief chandrababu during tirupati byelection poll campaign yesterday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X