ద్రౌపదీ ముర్ముతో టీడీపీ ఎంపీల భేటీ-స్పెషల్ అప్పీయరెన్స్ కేశినేని నాని
రాష్ట్రపతి అభ్యర్ధిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్ముతో టీడీపీ ఎంపీలు ఇవాళ భేటీ అయ్యారు. యశ్వంత్ సిన్హాతో పోరాడి గెలిచిన ఆమెను టీడీపీ ఎంపీలు అభినందించారు. ముర్మును ఇవాళ కలిసిన వారిలో టీడీపీ తరఫున అసంతృప్త స్వరాలు వినిపిస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని కూడా ఉన్నారు.
భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్మును టీడీపీ ఎంపీల బృందం ఇవాళ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపింది. టీడీపీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్ర కుమార్, రామ్మోహన్ నాయుడు రాష్ట్రపతిగా ఎన్నికైన ముర్ముతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ద్రౌపది ముర్ము చరిత్ర సృష్టించారని తెలిపారు. ద్రౌపది ముర్ము కు వారంతా హృదపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

ద్రౌపదీ ముర్మును కలిసిన టీడీపీ ఎంపీల బృందంలో పార్టీ అసంతృప్త ఎంపీ కేశినేని నాని కూడా ఉన్నారు. ఇప్పటికే కొంతకాలంగా పార్టీ అధిష్టానంపై విమర్శలు చేస్తున్న కేశినేని నాని.. ఇవాళ మాత్రం తోటి ఎంపీలతో కలిసి ముర్మును కలిసి అభినందించారు. వాస్తవానికి రాష్ట్రపతి పదవికి ఎన్డీయే తరఫున ఎంపికైన ద్రౌపదీ ముర్ము ఏపీకి రావడంతో ఆమెను విజయవాడలో టీడీపీ తరఫున సన్మానం నిర్వహించారు. ఈ ఫంక్షన్ ను కేశినేని నాని స్వయంగా నడిపించారు. పార్టీపై అసంతృప్తిగా ఉన్నప్పటికీ ప్రధాని మోడీ ఎంపిక చేసిన ద్రౌపదీ ముర్ము విషయంలో మాత్రం కేశినేని సానుకూలంగా ఉన్నారు. ఇవాళ మరోసారి ఆమెను కలిసిన టీడీపీ బృందానికి కూడా ఆయనే నేతృత్వం వహించారు.













Click it and Unblock the Notifications