విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ గెలిస్తే ఏం చేస్తాడో భయంగా ఉందని బాబు ఇంటికి పిలిచి చెప్పారు: పవన్ షాకింగ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

విశాఖపట్నం: వచ్చే ఎన్నికల్లో తాను గెలవచ్చొ, గెలవకపోవచ్చు కానీ కష్టమైనా నష్టమైనా ప్రజాక్షేత్రంలోనే ఉంటానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శనివారం చెప్పారు. ఉత్తరాంధ్ర పర్యటన ముగింపు సందర్భంగా ఏపీకి హోదా, రైల్వే జోన్, విభజన చట్టం హామీల అమలు కోరుతూ పవన్ ఆర్కే బీచ్ రోడ్డులో సాయంత్రం కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.

Recommended Video

2019 ఎన్నికల పై పవన్ ధీమా

చదవండి: చిరంజీవి తర్వాత జగన్ సాహసం!: న్యూజిలాండ్‌లో బంగీ జంప్ (వీడియో)

టీడీపీ నేతల దోపిడీ సాగనివ్వనని చెప్పారు. 2014లో తాను తన సోదరుడు చిరంజీవిని కాదని టీడీపీకి మద్దతిచ్చానని గుర్తు చేశారు. ఏపీకి మేలు చేస్తారనుకుంటే దోచేశారన్నారు. చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్ అంటే భయమని, మంత్రి నారా లోకేష్‌కు తాను ముఖ్యమంత్రి కావాలనే తపన అని మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్ కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని, అలాగే రైళ్లు ఆపితేనే జోన్ వస్తుందని, అలా చేసేందుకు లోకేష్, జగన్‌లు సిద్ధమా అని సవాల్ విసిరారు.

చదవండి: జగన్! నాతో వస్తావా, మురళీమోహన్! హేళనగా ఉందా?: టీడీపీకి పవన్ దిమ్మతిరిగే సవాల్

రైళ్లను ఆపడానికి నేను సిద్ధం, మీరూ సిద్ధమా

రైళ్లని ఆపేస్తే రైల్వేజోన్‌ వస్తుందని, కేసులకు భయపడకుండా పట్టాలపై కూర్చొంటేనే అది సాకారమవుతుందని, తాను రైళ్లను ఆపడానికి సిద్ధమని, తనతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్‌, మంత్రి నారా లోకేష్‌లు కలిసివస్తారా? అని పవన్ సవాల్‌ చేశారు. 2014లో మద్దతు ఇచ్చినప్పుడు ఏం కావాలని చంద్రబాబు తనను అడిగారని, సమాజంలో అసమానతలను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని తాను కోరానని పవన్ తెలిపారు. దానికి చంద్రబాబు సరే అన్నారని, వాస్తవంగా అది జరగలేదన్నారు. సమాజంలో కొన్ని వర్గాల వద్దే సంపద పోగుపడుతోందన్నారు. నాయకులు భూములను అడ్డగోలుగా దోచుకుంటున్నారని, ఒక్క విశాఖలోనే లక్ష ఎకరాలు దోచుకున్నారన్నారు.

కాంగ్రెస్ దౌర్జన్యంగా, టీడీపీ న్యాయబద్ధంగా అక్రమాలు

లోకేష్ సీఎం అయ్యే పరిస్థితులు కల్పిస్తున్నారని, కూలీ కొడుకు మాత్రం కూలీగానే మిగిలిపోతున్నాడని పవన్ అన్నారు. జగన్‌ వస్తే దోచుకుంటారంటూ ప్రచారం చేస్తున్న టీడీపీ చేసిందేమిటని ప్రశ్నించారు. సీఎం విజన్‌ 2050 తయారు చేశారని, అంటే అంతకాలం ఆయన, ఆయన కొడుకు, వారసులే అధికారం చెలాయిస్తామంటే ప్రజలు భరించాలా అన్నారు. కాంగ్రెస్‌ వాళ్లు దౌర్జన్యంగా అక్రమాలు చేస్తే టీడీపీ వాళ్లు న్యాయబద్ధంగా అక్రమాలు చేస్తారని, రెండు పార్టీలకు పెద్ద తేడా ఏమీ లేదన్నారు. చంద్రబాబు అధికారంలోకి రాకమునుపు బాక్సైట్‌ మైనింగ్‌ను వ్యతిరేకించారని, ఇప్పుడు తవ్వకాలు జరుగుతున్నాయన్నారు.

నాకు ఓటు వేసి గెలిపించండి

జీవించడానికి అనుకూలంగా లేక విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి వేలాది కుటుంబాలు వలసలు పోతున్నాయని పవన్ అన్నారు. తెలంగాణలో ఉత్తరాంధ్రకు చెందిన 22 సామాజిక వర్గాలకు రిజర్వేషన్లను తొలగిస్తే ఉత్తరాంధ్ర నాయకులు స్పందించలేదన్నారు. విశాఖలో కాలుష్య కారక పరిశ్రమలు స్థాపించి వ్యర్థాల్ని యథేచ్ఛగా సముద్రంలోకి వదిలేయడంతో నాలుగు నుంచి ఐదు కిలో మీటర్ల దూరంలో 23 రకాల జాతుల చేపలు అంతరించిపోయాయన్నారు. ఉత్తరాంధ్ర మొత్తం భస్మీపటలం కావడానికి కొవ్వాడ అణు విద్యుత్తు కేంద్రం ఒక్కటి చాలని మండిపడ్డారు. ఉత్తరాంధ్ర ప్రజలకు అండగా ఉంటానని, తనకు ఓటేసి గెలిపించాలన్నారు.

చంద్రబాబుకు జగన్ అంటే భయం

చంద్రబాబుకు జగన్ అంటే భయం

చంద్రబాబుకు జగన్‌ అంటే భయమని పవన్ అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబుకు జడ్‌ కేటగిరీ భద్రత తొలగించారని, ఎవరైనా చంపేస్తారనే భయంతో ఢిల్లీ వెళ్లి మన్మోహన్ సింగ్‌ సిఫార్సుతో తిరిగి భద్రత తెచ్చుకున్నారని,ఇప్పుడు జగన్‌ సీఎం అయితే తండ్రిలాగే చేస్తాడనే భయం బాబుకు ఉందని పవన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాకు ఏమీ అక్కర్లేదని, కేవలం ఒక్క ఓటు చాలని, జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పారు.

జగన్ ఏం చేస్తాడోనని భయంగా ఉంది, నాకు అండగా ఉండాలని

చంద్రబాబుకు జగన్ అంటే అంటే భయమని చెబుతూ పవన్ మరో షాకింగ్ విషయం కూడా చెప్పారు. చంద్రబాబు ఆ విషయం తనతోనే చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్‌ అధికారంలోకి వస్తే తానేమైపోతానోనని భయంగా ఉందని, 2014 ఎన్నికల తర్వాత ఇంటికి భోజనానికి పిలిచి ఒకవేళ తాను ఓడిపోతే అండగా ఉండాలని తనను స్వయంగా చంద్రబాబు కోరారని పవన్‌ చెప్పారు.

English summary
TDP MPs must resign and protest for Vizag railway zone says Jana Sena chief in Visakhapatnam Party parade on Saturday evening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X