అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పట్టాభి వ్యాఖ్యలు పరిధి దాటాయి - చంద్రబాబు కాల్ చేసారు, కానీ : చట్ట ప్రకారం చర్యలు -డీజీపీ..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

టీడీపీ నేతల పట్టాభి చేసిన వ్యాఖ్యలు పరిధి దాటి ఉన్నాయని ఏపీ డీజీపీ సవాంగ్ అభిప్రాయపడ్డారు. పట్టాభి మాట్లాడింది.. చాలా దారుణ భాష అని అన్నారు. ఒక్కసారి కాదు.. పదేపదే పట్టాభి దూషణలు చేశారని చెప్పారు. పట్టాభి వ్యాఖ్యలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తామని స్పష్టం చేసారు. గత కొన్ని రోజులుగా చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తామన్నారు. దీని వెనుక ఎలాంటి కుట్ర ఉన్నా దర్యాప్తులో బయటపెడతామని డీజీపీ తేల్చి చెప్పారు.

ఫోన్ కాల్ వచ్చింది..ఆ సమయంలో

ఫోన్ కాల్ వచ్చింది..ఆ సమయంలో

మంగళవారం సాయంత్రం 5.03 నిమిషాలకు వాట్సాప్ లో ఒక కాల్ వచ్చిందన్నారు. తాను పరేడ్ లో పోలీసు బ్యాండ్ లో ఉన్నానని..ఆ సౌండ్స్ లో వినపడక మాట్లాడలేక పోయానని డీజీపీ వివరించారు. ఒక రాజ్యాంగ సంస్థపై, ఒక ముఖ్యమంత్రి పై అలాంటి అభ్యన్తరం కర వ్యాఖ్యలు చెయ్యకూడదని చెప్పారు. ఆ వ్యాఖ్యలకు వచ్చిన రియాక్షన్ మనం చూశామన్నారు. పోలీసులకు నిన్నటి దాడుల పై సమాచారం లేదని స్పష్టం చేసారు.

పట్టాభి నోరు జారి కాదు..పరిధి దాటారు

పట్టాభి నోరు జారి కాదు..పరిధి దాటారు

పట్టాభి నోరు జారి అన్న వ్యాఖ్యలు కాదన్నారు. ఈ మొత్తం వ్యవహారం పైన విచారణ ..చట్ట ప్రకారం కారకులపైన చర్యలు ఉంటాయని స్పష్టం చేసారు. విజయవాడకు డ్రగ్స్ తో ఏమాత్రం సంబంధం లేదన్నారు. అయినా కొందరు కావాలని ఆరోపణలు చేస్తున్నారన్నారు. స్పష్టంగా చెప్పినా పదేపదే ఆరోపణలు సరికాదన్నారు. ఆరోపణలు చేయవద్దని చెబుతున్నాం. గుజరాత్ లో దొరికిన డ్రగ్స్ తో ఏపీకి సంబంధం లేదు. ఒక గ్రామ్ కూడా విజయవాడకు రాలేదన్నారు.

21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

21న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ప్రతీ సంవత్సరం 21 అక్టోబరు న జరుపుతామని.. గుర్తు చేసారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసుల సంస్మరణ జరుపుకుంటామన్నారు. సమాజ శ్రేయస్సు,భద్రత కోసం పోలీసులు పని చేస్తారని.. చాలా బాధాకరమైన, క్లిష్టమైన సమయాలు కూడా పోలీసులకు ఉంటాయని వివరించారు. 206 మంది పోలీసులు కోవిడ్ కారణంగా మరణించారని చెప్పారు. 11 మంది గత సంస్మరణ దినోత్సవం తర్వాత మరణించారన్నారు. సమాజంలో పోలీసు కుటుంబాలతో సమానంగా ఎవరూ కష్టాలు భరించలేదని చెప్పారు.

పోలీసు కుటుంబాలకు అండగా నిలుస్తాం

పోలీసు కుటుంబాలకు అండగా నిలుస్తాం

చాలా జాగ్రత్తలు కోవిడ్ కాలంలో పోలీసుల కోసం తీసుకున్నామని వివరించారు. ప్రభుత్వ సహకారంతో ప్రత్యేక సదుపాయాలు కల్పించామన్నారు. పోలీసులకు కోవిడ్ కాలంలో వర్క్ ఫ్రం హోం ఇచ్చామని వెల్లడించారు. గర్భిణులు, పాలిచ్చే మహిళా పోలీసులకు వర్క్ ఫ్రం హోం ఇచ్చామని గుర్తు చేసారు. క్వారంటైన్ లో ఉన్న పోలీసులకు మానసిక ధైర్యం కల్పించామని డీజీపీ చెప్పారు. 1472 మందికి 7.57 కోట్ల వడ్డీలేని రుణాలు ఇచ్చి ఆర్ధిక సహాయం చేసామని..ఫ్యామిలీ వెల్ఫేర్ డెస్కుల ద్వారా అందరికీ సహాయం అందేలా చేసామని డీజీపీ సవాంగ్ వివరించారు.

English summary
DGP Gowtham Swang had responded over chandra Babu comments, he clarified that he had received the phone call.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X