జేఏసీ ముసుగులో వైసీపీ-సీమ ప్రజలూ అలర్ట్ -టీడీపీ మాజీ మంత్రి కాల్వశ్రీనివాసులు
ప్రాంతీయ చిచ్చుతో చలికాచుకోవాలని చూస్తున్న వైసీపీ నాయకుల పన్నాగాలను ప్రజలు గ్రహించాలని టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు పేర్కొన్నారు. రాష్ట్రంలో వైసీపీ వికృత రాజకీయ క్రీడలకు అంతులేకుండాపోతోందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని, అన్ని వర్గాల ప్రజలను ఆదుకొమ్మని, అత్యంత వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్రలకు పెద్దపీట వేయమని ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెబితే... ఈ మూడున్నర సంవత్సరాలుగా ఎక్కడా అభివృద్ది కార్యక్రమాలు చేయలేదని కాల్వ ఆరోపించారు. టీడీపీ సర్కార్ ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆగిపోయాయన్నారు.
ఉత్తరాంధ్రలో వైసీపీ విభజన రాజకీయాలు చేస్తోందని, అధికారంలో ఉండేవారే ఆందోళనలు చేస్తున్నారని కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. అధికారంలో ఉండేవారే ఆందోళన చేయడమంటే దొంగే దొంగ.. దొంగ అని అరిచినట్లు అవుతుందన్నారు. రాష్ట్రాన్ని పరిపాలించమని అధికారాలు, అవకాశమిస్తే ఆ అవకాశాలను స్వార్థానికి మార్చుకున్నారన్నారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అధికారంలో ఉండి రాయలసీమకు అన్యాయం జరిగిందని ర్యాలీ చేయడం, ఆక్రోశాన్ని వెళ్లగక్కడం సరికాదన్నారు. 1937లో శ్రీ బాగ్ ఒడంబడిక అమలు జరగడంలేదని గగ్గోలు పెడుతున్నారని, ఈ ఒప్పందంలోని అంశాలను అమలు చేయొద్దని ఎవరూ అనలేదన్నారు. ఎవరు అభివృద్ధి నిరోధకులుగా మారారో ప్రజలు గ్రహిస్తున్నారన్నారు.

టీడీపీ హయాంలో రాయలసీమకు న్యాయం చేశామని, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానికి రాయలసీమను అభివృద్ధి చేయొద్దని ఎవరూ చెప్పలేదని కాల్వ తెలిపారు. సామాజిక పెద్దలే ప్రభుత్వ స్థానాల్లో ఉండి రాయలసీమ పట్ల హీనంగా వ్యవహించారని విమర్శించారు. అధికారం వైసీపీ చేతుల్లోనే ఉందని, అభివృద్ధి చేయాల్సింది వారేనని కాల్వ తెలిపారు. దాన్ని విస్మరించి కొత్తగా ప్రాంతీయ విబేధాలు, విద్వేషాలను రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. మేధావుల ముసుగులో జగన్ జీతగాళ్లు ఉన్నారన్నారు. సీఎం రాయలసీమ వాసులుగా ఉండి ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయలేదని కాల్వ పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రాజెక్టు పనులు పడకేశాయన్నారు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయకపోతే అభివృద్ధి జరగదు అనే విషయం వైసీపీ నాయకులకు తెలియదా అని ప్రశ్నించారు.
ఈ మూడున్నరేళ్లలో ఎమ్మెల్యేలు జగన్ ను రాయలసీమను అభివృద్ధి చేయండని ఎందుకు అడగలేదని కాల్వ ప్రశ్నించారు.రాయలసీమ మొత్తం వారి ఆధిపత్యంలోనే నడుస్తోందని, కడపలో గడికోట శ్రీకాంత్ రెడ్డి, అనంతపురంలో వెంకటరామిరెడ్డి లు ప్రెస్ మీట్ లు పెట్టి మాట్లాడుతారే.. జగన్ ను ఎందుకు అడగరు అని నిలదీశారు. అభివృద్ధి వికేంద్రీకరణను కోరుకునే వ్యక్తి చంద్రబాబని, ఆ వికేంద్రీకరణలో అభివృద్ధి ఉండాలన్నారు. చంద్రబాబు రాయలసీమ ప్రాజెక్టులకు 5 సంవత్సరాల్లో రూ.10,747 కోట్లు ఖర్చు చేశారని, జగన్ అధికారంలోకి వచ్చి ఈ మూడున్నర సంవత్సరాల్లో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు కేవలం రూ.2,700 కోట్లు మాత్రమే ఖర్చు చేసి రాయలసీమ గొంతు కోశారన్నారు. జగన్ రాజకీయ ప్రయోజనాల కోసం, ఆర్థిక అవసరాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారన్నారు. కేసీఆర్ తో అంటకాగుతూ రాయలసీమకు తీరని ఇబ్బందులు సృష్టించారన్నారు. కమీషన్లకు కక్కుర్తి పడి రాయలసీమను నాశనం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే కోట్ల రూపాయల ఆదాయం కోసం రాయలసీమ భవిష్యత్తును తాకట్టు పెట్టారు. ఇలా ఎంతకాలం మోసం చేస్తారు? చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకునే రకం వైసీపీదన్నారు. అలా రాయలసీమ పేరు చెప్పి పేదరికాన్ని చూపి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. తరతరాలుగా రాయలసీమను దోచుకుతింటున్నా ఇంకా మీ కడుపు నిండలేదా? అని ప్రశ్నించారు. రాయలసీమకు మీరెంత ఖర్చు పెట్టారో, మేమెంత ఖర్చు పెట్టామో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు.
-
Amaravati: అసెంబ్లీలో రాజధాని తీర్మానం-స్పీకర్, చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..! -
జగన్ కు జనాలిచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిపోలేదేమో..మంత్రి లోకేష్ సెటైర్లు -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications