చంద్రబాబు, ఆయన బృందానికి పిచ్చి ముదిరింది...! ఎమ్మెల్యే రోజా
బాక్సైట్ తవ్వకాలను తామే రద్దు చేశామంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చెప్పడం పై ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగానే విశాఖలో బాక్సౌట్ తవ్వకాలను రద్దు చేశారని ఆమె తెలిపారు. విశాఖ మన్యంలో గిరిజనులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఘనత వైఎస్ఆర్‌సీపీకే దక్కుతుందని ఆమె చెప్పారు. మొత్తం అయిదు జీవోల ద్వార బాక్సైట్ తవ్వకాలకు వైఎఎస్‌ఆర్ ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు.
అయితే చంద్రబాబు నాయుడు బాక్సైట్ తవ్వకాలను రద్దు చేశామని చెప్పుకోవడం సిగ్గు చేటని దుయ్యబట్టారు. చంద్రబాబుతో పాటు ఆయన వర్గానికి పిచ్చి బాగా ముదిరిపోయిందని ఈ సంధర్భంగా విమర్శించారు. వారిని మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలని ఎద్దేవా చేసిన ఆమె చంద్రబాబు విధానాల వల్ల ఓ గిరిజన ఎమ్మెల్యే మావోయిస్టుల చేతిలో హతమయ్యారని ఆరోపించారు.

విశాఖ ఏజెన్సీలో గత ప్రభుత్వం 30 ఏళ్ల పాటు లీజుకిచ్చిన బాక్సైట్ తవ్వకాల అనుమతిని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.... అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్, జెర్రెల బ్లాక్ , గాలికొండ, చిత్తమగొండి, రక్తికొండ, చింతపల్లి రిజర్వ్ ఫారెస్ట్ గ్రామాల్లో బాక్సైట్ అనుమతులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే బాక్సైట్ తవ్వకాలను ఇదివరకే తాము రద్దు చేశామని టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పారు.గతంలోనే రద్దు చేసిన తవ్వకాలను ఎన్నిసార్లు రద్దు చేస్తారంటూ ఆయన ప్రశ్నించారు.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications