వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోర్టుకు వెళ్తాం: మోడీకి జయదేవ్-రామ్మోహన్ నాయుడు తీవ్ర హెచ్చరిక, ఇదీ మా ప్లాన్!

|
Google Oneindia TeluguNews

అమరావతి: ఏపీ ప్రయోజనాల విషయంలో టిడిపి వెనుకడుగు వేసే ప్రసక్తి లేదని, అవసరమైతే కోర్టుకైనా వెళ్తామని టీడీపీ ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, తోట నర్సింహం తదితరులు శుక్రవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో భేటీ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.

షా వద్దకు.. ఫలించని వెంకయ్య చొరవ: 'ఫార్ములా' చెప్పాం కానీ.. బాబుకు షాక్, జైట్లీ సంచలనంషా వద్దకు.. ఫలించని వెంకయ్య చొరవ: 'ఫార్ములా' చెప్పాం కానీ.. బాబుకు షాక్, జైట్లీ సంచలనం

ప్రజల మనోభావాలకు అనుగుణంగా తమ పోరాటం ఉంటుందని చెప్పారు. ప్రత్యేక హోదా వద్దని టీడీపీ ఎప్పుడూ చెప్పలేదని తేల్చి చెప్పారు. హోదాకు సమానంగా ప్యాకేజీ ఇస్తామంటే అంగీకరించామని, ఇతర రాష్ట్రాలకు హోదా కొనసాగించినప్పుడు ఏపీకి ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఏపీకి సాయం చేయకుంటే తీవ్ర నిర్ణయాలు ఉంటాయని హెచ్చరించారు.

వైసీపీ అదొక్కటే అడుగుతోంది

వైసీపీ అదొక్కటే అడుగుతోంది

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం ప్రత్యేక హోదా గురించి మాత్రమే అడుగుతున్నారని, కానీ తాము హోదాతో పాటు విభజన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నామని గల్లా జయదేవ్ అన్నారు. హోదాకు సమానమైన ప్యాకేజీ ఇస్తామన్నారని, అందుకే తాము ఊరుకున్నామని, ఇప్పుడు రాష్ట్రాలకు ఇస్తున్నందున మాకు ఇవ్వాలన్నారు.

Recommended Video

TDP Unsure About Govt's Assurance On AP Bifurcation Act
అవసరమైతే కోర్టుకు వెళ్తాం

అవసరమైతే కోర్టుకు వెళ్తాం

విభజన చట్టంలో ఉన్న 19 అంశాలు, రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలు.. ఇలా అన్నింటిని ఇవ్వాలని జయదేవ్ అన్నారు. అవసరమైతే తాము కోర్టుకు కూడా వెళ్తామని చెప్పారు. బీజేపీ మిత్రపక్షం కాబట్టి వారిని నమ్మాలి కాబట్టి తాము ఇన్నాళ్లు నమ్మామన్నారు. ఇప్పుడు ఆ నమ్మకం కోల్పోతున్నారని అభిప్రాయపడ్డారు.

 మిత్రపక్షం కాబట్టి ఇప్పటి వరకు నమ్మాం

మిత్రపక్షం కాబట్టి ఇప్పటి వరకు నమ్మాం

బీజేపీ తమ మిత్రపక్షం కాబట్టి, వారు చెప్పింది ఇన్నాళ్లు నమ్మామని, ఇప్పటికీ వారు ఏమీ చేయకుండై కీలకమైన అడుగు వేయవలసి ఉంటుందని గల్లా జయదేవ్ బీజేపీకి హెచ్చరికలు జారీ చేశారు. ఏపీ అంశాన్ని జాతీయ అంశంగా మారుస్తామని చెప్పారు. కేంద్రం ఓ హామీ ఇచ్చినప్పుడు ఎంత వరకు నమ్మవచ్చు అని అడిగేలా తాము చేశామన్నారు.

 బీజేపీ నేతలు చెప్పిందే చెబుతున్నారు

బీజేపీ నేతలు చెప్పిందే చెబుతున్నారు

ఎంపీ రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. కేంద్రమంత్రులు, బీజేపీ నేతలు చెప్పిందే చెబుతున్నారు తప్ప, హామీలపై స్పష్టత లేకుండా పోయిందని ఆరోపించారు. తమ ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని చెప్పారు. కేవలం కేంద్రంపై ఒత్తిడి అంటే.. బీజేపీ పైన ఒత్తిడి తేవడంతో పాటు, ఇతర పార్టీలకు కూడా తాము ఎందుకు ఆందోళన చేయాల్సి వచ్చిందో చెబుతామన్నారు.

 వైసీపీ రాజకీయంగా ఉపయోగించుకునే ప్లాన్

వైసీపీ రాజకీయంగా ఉపయోగించుకునే ప్లాన్

నాడు పార్లమెంటులో విభజన సమయంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు హామీలు ఇచ్చాయని రామ్మోహన్ నాయుడు చెప్పారు. విభజన చట్టానికి సంబంధించిన 19 అంశాలను కాలపరిమితితో నెరవేర్చాలన్నారు. దీనిని తాము రాజకీయంగా వాడుకోమని చెప్పారు. కానీ వైసీపీ హోదా అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తోందన్నారు.

అన్ని పార్టీలకు లెటర్లు

అన్ని పార్టీలకు లెటర్లు

ప్రత్యేక హోదా, రైల్వే జోన్, విభజన హామీలు.. అన్నింటిపై తాము పోరాడుతామని రామ్మోహన్ నాయుడు అన్నారు. తాము ఎందుకు ఆందోళన చేస్తున్నామనే విషయమై అన్ని పార్టీలకు తాము లెటర్లు కూడా ఇస్తామన్నారు. చంద్రబాబు అన్ని పార్టీలకు లేఖలు రాస్తారన్నారు. పార్లమెంటులో ఏపీ అంశంపై చర్చ జరగాలన్నారు. సమావేశాల సందర్భంగా ఎంపీలం అందరం ప్రజలకు అనుగుణంగా పని చేస్తామన్నారు. తాము కూడా మిగతా పార్టీల సహకారం కోరుతున్నామని చెప్పారు.

జాతీయ అంశంగా

జాతీయ అంశంగా

కేంద్రంతో పాటు పార్లమెంటులో ఉన్న ప్రతి పార్టీ తమకు మద్దతు తెలపాలని రామ్మోహన్ నాయుడు అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు తమకు సహకరించాలన్నారు. విభజన అంశాన్ని తాము జాతీయ అంశంగా చేయాలని భావిస్తున్నామన్నారు.

లెటర్లో ఏముంటుందంటే

లెటర్లో ఏముంటుందంటే

కాంగ్రెస్, బీజేపీ అన్యాయం చేసిందని ఆరోపణలు చేయడం కంటే ఏ సమస్యలు పెండింగులో ఉన్నాయో లెటర్లలో పేర్కొంటామన్నారు. నాలుగేళ్లుగా తాము ఎంత మిత్రధర్మంతో ముందుకు నడిచామో, ఈ రోజు ఎందుకు ఆందోళనలు చేస్తున్నామో లెటర్‌లలో వివరిస్తామని రామ్మోహన్ నాయుడు చెప్పారు.

English summary
Telugudesam Party MPS Galla Jayadev and Rammohan Naidu on Friday said that TDP will approach court if Centre fail to help Andhra Pradesh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X