YS Jagan Stone Attack: జగన్ పై దాడి కేసు విచారణ-ఈసీ జోక్యం కోరిన టీడీపీ..!
ఏపీలో సీఎం వైఎస్ జగన్ పై విజయవాడలో జరిగిన రాయి దాడి వ్యవహారం ఎన్నికల వేళ రాజకీయంగా ప్రకంనలకు కారణమవుతోంది. జగన్ పై దాడి కేసులో పోలీసులు చేస్తున్న విచారణపై ఇప్పటికే విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. అదే సమయంలో పోలీసులు ఇప్పటికే ఓ నిందితుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు. మరికొందరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. వీరికీ, విజయవాడ సెంట్రల్ టీడీపీ అభ్యర్ధి బోండా ఉమకూ లింక్ ఉందని నిరూపించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఈ నేపథ్యంలో రెండు రోజులుగా బోండా ఉమను పోలీసులు అరెస్టు చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇందుకు అనుగుణంగానే నిన్న బోండా ఉమ ఆఫీసుకు డీసీపీ, ఏసీపీ, ఎస్సీ, సీఐలు కలిపి 100 మంది వరకూ వెళ్లడంతో అరెస్టు తప్పదని అంతా భావించారు. కానీ పోలీసులు ఎందుకో వెనక్కి తగ్గారు. దీంతో ఇవాళ బోండా ఉమ ప్రెస్ మీట్ పెట్టి పోలీసుల తీరుపై మండిపడ్డారు. ఇప్పుడు ఇదే అంశంపై టీడీపీ కూడా ఈసీకి ఫిర్యాదు చేసింది.

విజయవాడ సెంట్రల్ సీటు నుంచి టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న బోండా ఉమను టార్గెట్ చేసేలా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ టీడీపీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఇవాళ ఈసీకి లేఖ రాశారు. ఇందులో ఆయన పలు అంశాల్ని ప్రస్తావించారు. సీఎం జగన్ పై జరిగిన రాయి దాడికి బోండా ఉమను బా్ధ్యుడిని చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఈసీ దృష్టికి తెచ్చారు. ఈ నేపథ్యంలో ఈసీ వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications