గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నాకు హోం మంత్రి పదవి కావాలి - చంద్రబాబుకు సీనియర్ అల్టిమేటం..!!

|
Google Oneindia TeluguNews

టీడీపీ సీనియర్లకు కొత్త కోరికలు మొదలయ్యాయి. అప్పుడే అధికారం వచ్చినట్లు ఊహల్లో విహరిస్తున్నారు. పదవుల కోసం డిమాండ్లు మొదలు పెట్టారు. ఏపీలో రానున్న ఎన్నికలు టీడీపీ ప్రతిష్ఠాత్మకంగా మారుతున్నాయి. ఎలాగైనా అధికారంలోకి రావాలనేది చంద్రబాబు లక్ష్యం. ఇందుకోసం పొత్తుల దిశగానూ నిర్ణయాలు తీసుకుంటున్నారు. జనసేనతో పొత్తు దాదాపు ఖాయమైంది. బీజేపీని కలుపుకొని పోవాలని భావిస్తున్నారు. ఈ సమయంలో పార్టీ సీనియర్లు చేస్తున్న వ్యాఖ్యలు..డిమాండ్లు పార్టీలో కొత్త చర్చకు కారణమవుతున్నాయి.

టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు గుంటూరు జిల్లాల్లో పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్ ..మంత్రి రోజా పైన గతంలో చేసిన అనుచిత వ్యాఖ్యలను మరోసారి ప్రస్తావించారు. అదే సమయంలో పోలీసుల తీరు పైన మండిపడ్డారు. గెలిచిన ఏడాదిలో మద్యం షాపులు మూసివేస్తామని హామీ ఇచ్చారని వైసీపీ ప్రభుత్వంపైన అయ్యన్న ఫైర్ అయ్యారు. పాతికేళ్ల పాటు మద్యం షాపులు తనఖా పెట్టి ఎనిమిది వేల కోట్లు అప్పు తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేసారు. ఇది మోసం చేయటం కాదా అని ప్రశ్నించారు. పోలీసులు చట్ట బద్దంగా వ్యవహరించాలని సూచించారు. అధికారంలో ఉన్న వారి మెప్ప కోసం ప్రయత్నిస్తే, తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఇబ్బందులు తప్పవని అయ్యన్న హెచ్చరించారు.

TDP Senior leader Ayyanna Patrudu sensationa comments on CM Jagan and Police deptmt

ఇప్పుడు తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులు తాము అధికారంలోకి వచ్చిన తరువాత పర్యవసానాలు ఎదుర్కోక తప్పదన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవటం..చంద్రబాబు మరోసారి ముఖ్యమంత్రి కావటం తథ్యమని ధీమా వ్యక్తం చేసారు. తనకు హోం మంత్రి పదవి కావాలని అయ్యన్న డిమాండ్ చేసారు. తనకు హోం మంత్రి పదవి ఇస్తే ఇప్పుడు ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న పోలీసుల అంతు తాను చూస్తానని హెచ్చరించారు. పోలీసు వ్యవస్థ మొత్తం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. చెత్త పన్ను గురించి ప్రస్తావిస్తూ సీఎం గురించి వ్యాఖ్యలు చేసారు. రాష్ట్రంలో ప్రస్తుతం సైకో పాలన కొనసాగుతోందంటూ విమర్శలు చేసారు. రుషికొండలో నిర్మాణాల గురించి ప్రస్తావించిన అయ్యన్న కీలక వ్యాఖ్యలు చేసారు.

English summary
TDP Polit Buero member Chintakayala Ayyannapatrudu Demands Home Minister port folio in next coming TDP Govt.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X