ఎల్లుండే వైసీపీలోకి యనమల ? చర్చలు పూర్తి..!

ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీకి పట్టున్న కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో మంత్రి దాడిశెట్టి రాజాకూ, యనమల రామకృష్ణుడు కుటుంబానికీ మధ్య ఎప్పటి నుంచో వార్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గత రెండు ఎన్నికల్లో యనమల కుటుంబం నుంచి దాడిశెట్టి రాజా మీద పోటీ చేసిన యనమల రామకృష్ణుడు సోదరుడు కృష్ణుడు ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ యనమల కుటుంబంలో విభేదాలు తారా స్ధాయికి చేరాయి.

టీడీపీ మాజీ మంత్రి, సీనియర్ నేత అయిన యనమల కుటుంబం నుంచి ఈసారి కృష్ణుడికి బదులుగా రామకృష్ణుడు కుమార్తె దివ్యను పార్టీ ఎమ్మెల్యే అభ్యర్దిగా బరిలోకి దించుతోంది. కానీ తునిలో మూడోసారి పోటీకి సిద్ధమైన కృష్ణుడు దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన దివ్యకు సహకరించకుండా దూరంగా ఉండిపోతున్నారు. ఇప్పుడు వైసీపీ నేతలతో టచ్ లోకి వెళ్లిన ఆయన పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు.

tdp senior leader yanamala krishnudu to join ysrcp soon

ఇప్పటికే తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో టచ్ లోకి వెళ్లి చర్చలు జరిపిన యనమల కృష్ణుడుకి సానుకూల సంకేతాలు లభించాయి. అయితే బేషరతుగానే పార్టీలో చేరాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో కృష్ణుడు త్వరలో వైసీపీలో చేరే అవకాశముంది. అంతకంటే ముందే ఇవాళ వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్ది చలమలశెట్టి సునీల్ నామినేషన్ ర్యాలీలో పాల్గొనేందుకు ఆయన సిద్దమవుతున్నారు. అనంతరం ఎల్లుండి వైసీపీ తీర్దం పుచ్చుకుంటారు.

అయితే తునిలో గత దశాబ్దకాలంగా రాజకీయాన్ని గమనిస్తే.. గతంలో వరుస విజయాలు సాధించిన యనమల రామకృష్ణుడు రాజకీయంగా పతనం కావడానికి ఆయన సోదరుడు కృష్ణుడే కారణమని స్ధానికంగా ప్రచారం ఉంది. దీంతో నేరుగా కృష్ణుడు పోటీ చేసినా యనమల కుటుంబానికి మళ్లీ విజయం దక్కలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ తుని ఎమ్మెల్యే అభ్యర్ధిగా రామకృష్ణుడు కుమార్తె దివ్యను ఎంచుకుంది. దీంతో అలిగిన కృష్ణుడిని చంద్రబాబు బుజ్జగించినా వెనక్కి తగ్గలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+