టీడీపీ రెండో లిస్టు ఎఫెక్ట్ - సీనియర్ల గుడ్ బై..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం ఉత్కంఠగా మారుతోంది. పొత్తులో భాగంగా సీట్ల కేటాయింపుతో టీడీపీ సీనియర్ల ఆశలు గల్లంతు అవుతున్నాయి. సీట్లు రాని పలువురు సీనియర్లు రాజీనామా బాట పడుతున్నారు. విశాఖ కేంద్రం గా కొందరు నేతలు రాజీనామా ప్రకటించారు. ఉమ్మడి క్రిష్ణా జిల్లా పెనమలూరు ఇంచార్జ్ బోడే ప్రసాద్ కు సీటు దక్కటం లేదని తెలుస్తోంది. ఆయన అనుచరులు పార్టీ పైన ఆగ్రహంతో ఉన్నారు. కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు.
టీడీపీ రెండో జాబితాతో
టీడీపీ రెండో జాబితా విడుదల అయింది. తొలి జాబితాలో సీట్లు దక్కని ముఖ్య నేతలు రెండో జాబితా పైన ఆశలు పెట్టుకున్నారు. అయితే, జనసేన - బీజేపీకి సీట్ల ఖరారులో భాగంగా తమకు సీట్లు లేకపోవటం తో వారంతా ఆగ్రహంతో ఉన్నారు. విశాఖ పరిధిలోని పెందుర్తి, యలమంచిలి స్థానాలు జనసేనకు వెళ్లటంతో అక్కడి ఇంఛార్జ్ లు బండారు సత్యానారాయణ మూర్తి, నాగేశ్వర రావు మనస్థాపానికి గురయ్యారు.

వారి తమ అనుచర వర్గంతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారంతా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విశాఖ సౌత్ సీటు ఆశించిన ఇంఛార్జ్ గండి బాబ్జీ టీడీపీకి రాజీనామా చేసారు. భీమిలికి చెందిన మరో నేత పాసర్ల ప్రసాద్ తాను టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
సీట్లు దక్కని సీనియర్లు
అటు పార్టీ సీనియర్ నేత రుషికొండలో తమ అనుచర వర్గంతో భేటీ అయ్యారు. భీమిలి సీట పైన గంటా ఆశలు పెట్టుకున్నారు. అయితే, గంటాను విజయనగరం జిల్లా చీపురుపల్లి నుంచి పోటీ చేయాలని చంద్రబాబు సూచించారు. ఇందుకు గంటా సుముఖంగా లేరు. ఈ పరిస్థితుల్లో భవిష్యత్ కార్యాచరణ పైన చర్చించటానికి అనుచరవర్గంతో భేటీ అయ్యారు.
ఈ సమావేశం సుదీర్గంగా కొనసాగుతోంది. చంద్రబాబు ప్రకటించిన రెండో జాబితాలోనూ భీమిలికి అభ్యర్దిని ఖరారు చేయలేదు. అటు పశ్చిమ గోదావరిలో పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతున్న ముళ్లపూడి రేణుక రాజీనామా చేసారు. టీడీపీకి గుడ్ బై చెప్పిన రేణుక బీజేపీలో చేరాలని నిర్ణయించారు. ఇక, ఉమ్మడి క్రిష్ణా జిల్లాలోనూ టీడీపీ సీట్ల ఖరారు పైన రచ్చ కొనసాగుతోంది.
పెనమలూరు దక్కేదెవరికి
మైలవరం సీటు వైసీపీ నుంచి వచ్చిన వసంత కృష్ణ ప్రసాద్ కు సీటు ఖాయమైంది. ఈ సీటు పైన టీడీపీ నేతలు దేవినేని ఉమా, బొమ్మసాని సుబ్బారావు సీటు ఆశిస్తున్నారు. అయితే, వసంతకు మైలవరం ఇస్తే ఉమాకు పెనమలూరు సీటు ఇస్తారనే ప్రచారం సాగింది. కానీ, పెనమలూరు నుంచి సినీ - రాజకీయ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తికి సీటు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది.
దీంతో, చంద్రాబు సన్నిహిత వ్యక్తులు బోడే ప్రసాద్ ను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభించారు. అనివార్య కారణాల వలన సీటు ఇవ్వలేకపోతున్నామని నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బోడే ప్రసాద్ అనుచర వర్గం మాత్రం సీటు ఇవ్వకుంటే స్వతంత్ర అభ్యర్దిగా బరిలో నివాలని కోరుతున్నట్లు తెలుస్తోంది. దీంతో..ఇప్పుడు టీడీపీలో సీట్లు దక్కని సీనియర్లు ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారనేది ఉత్కంఠ పెంచుతోంది.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications