వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ 'తమిళ' ఆట, ఎన్డీయే నుంచి ఔట్! బట్టలూడదీసి కొడతారు.. పవన్‌పై మూకుమ్మడి దాడి

|
Google Oneindia TeluguNews

అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గుంటూరు పార్టీ ఆవిర్భావ సభలో టీడీపీని టార్గెట్ చేసి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేడి పుట్టించారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయని తేలిపోయింది.

చదవండి: టిడిపిని అడిగాం: అవిశ్వాస తీర్మానంపై జగన్, లోకసభ జనరల్ సెక్రటరీకి నోటీసులు

పవన్ విమర్శలు, ఆరోపణలపై సీఎం చంద్రబాబు సహా టీడీపీ నేతలు దుమ్మెత్తి పోశారు. చంద్రబాబు, మంత్రి లోకేష్‌లు అసెంబ్లీ వేదికగా పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. చినరాజప్ప, ఆదినారాయణ రెడ్డి, బోండా ఉమ, డొక్కా మాణిక్య వరప్రసాద్, బుద్దా వెంకన్న, కళా వెంకట్రావు తదితరులు దుమ్మెత్తి పోశారు.

చదవండి: నన్ను అలా అంటారా!: రైల్వే జోన్‌పై పీయూష్ గోయెల్ క్లారిటీ, బాబుకు కౌంటర్

కమలం వైపు మరలిన పవనం

కమలం వైపు మరలిన పవనం

పవనం కమలం వైపు మళ్లిందని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ప్రశ్నిస్తానని చెప్పే పవన్ మొదట ఆయనను ఆయన ప్రశ్నించుకోవాలన్నారు. ఆయనకు ప్రశ్నించే అర్హత ఏముందని, ప్రజలకు ఏం చేశావని ప్రశ్నిస్తున్నారు. నీవేదో నిజాయితీపరుల్లా మాట్లాడుతున్నారని విమర్శించారు. నీకు కౌంట్ డౌన్ ప్రారంభమైందని మండిపడ్డారు.

నన్ను అలా అంటారా!: రైల్వే జోన్‌పై పీయూష్ గోయెల్ క్లారిటీ, బాబుకు కౌంటర్నన్ను అలా అంటారా!: రైల్వే జోన్‌పై పీయూష్ గోయెల్ క్లారిటీ, బాబుకు కౌంటర్

ఇద్దరిని మోడీ నడిపిస్తున్నారని

ఇద్దరిని మోడీ నడిపిస్తున్నారని

అంతేకాదు, ఇన్నాళ్లు పవన్ వెనుక టీడీపీ ఉందని వైసీపీ చెబుతుంటే తెలుగు తమ్ముళ్లు ఒకింత వెనుకేసుకొచ్చారు. ఇప్పుడు టీడీపీ విమర్శిస్తుంటే వైసీపీ, బీజేపీలు వెనుకేసుకొస్తున్నాయి. దీంతో టీడీపీ సంచలన ఆరోపణలు చేస్తోంది. జగన్, పవన్‌ను మోడీ నడిపిస్తున్నారని స్వయంగా చంద్రబాబు అనడం గమనార్హం. బీజేపీ స్క్రిప్ట్, వైసీపీ సహకారంతో పవన్ మాటల దాడి చేశారని, కేంద్రమంత్రుల రాజీనామా తర్వాత బీజేపీ రంగంలోకి దిగి టీడీపీని ఇరకాటంలో పడేసే ప్రయత్నాలు చేసిందని మండిపడుతున్నారు. మోడీ ఓ భుజంపై పవన్‌ను, మరో భుజంపై జగన్‌ను ఎత్తుకున్నారని ఎద్దేవా చేస్తున్నారు.

ఎన్నో సంక్షోభాలు చూశా, ఎవరికీ భయపడేది లేదు

ఎన్నో సంక్షోభాలు చూశా, ఎవరికీ భయపడేది లేదు

చంద్రబాబు అసెంబ్లీ లోపల, బయట పవన్‌పై నిప్పులు చెరిగారు. తాను ఎన్నో సంక్షోభాలు చూశానని, ఎవరికీ భయపడనని అన్నారు. కేంద్రం ఏపీకి సహకరించడం లేదని ఏపీకి హోదా ఇవ్వడం లేదని ఆరోపించారు. విభన చట్టం హామీలు అమలు చేయడం లేదన్నారు. కష్టకాలంలో తనకు అండగా ఉండకుండా తనపై విమర్శలా అని చంద్రబాబు ప్రశ్నించారు. మోడీని నిలదీయకుండా తనను అంటారా అని ప్రశ్నించారు. బీజేపీ చెప్పింది చేయకుండా కొందరిని తనపైకి రెచ్చగొడుతున్నారన్నారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను ఇబ్బంది పెట్టవద్దన్నారు.

మోడీ దెబ్బ, పవన్-జగన్ వ్యూహంలో చిక్కుకున్న బాబు?మోడీ దెబ్బ, పవన్-జగన్ వ్యూహంలో చిక్కుకున్న బాబు?

రాష్ట్రాలను కేంద్రం బలహీనపరుస్తోంది

రాష్ట్రాలను కేంద్రం బలహీనపరుస్తోంది

రాష్ట్రాలను కేంద్రం బలహీనపరుస్తోందని కూడా చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేపో ఎల్లుండే అన్నీ బయటపెడతానని హెచ్చరించారు. ఢిల్లీలో రహస్య ఒప్పందాలు జరుగుతున్నాయని ఆరోపించారు. దీంతో చంద్రబాబు ఏం బయటపెడతారనే ఆసక్తికర చర్చ సాగుతోంది. తాను నాలుగేళ్లు ఓపిక పట్టానని, బీజేపీని అనకుండా తనను విమర్శించడం ఏమిటన్నారు. అంతేకాదు, తమిళ రాజకీయాల్లా ఏపీ రాజకీయాల్లో కేంద్రం వేలు పెట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు మాట తీరు చూస్తుంటే ఆయన ఎన్డీయే నుంచి బయటకు వెళ్లేందుకే సిద్ధమయ్యారని అర్థమవుతోంది. శుక్రవారం ఆయన తేల్చేయనున్నారు.

గబ్బర్ సింగ్ గురితప్పాడంటూ

గబ్బర్ సింగ్ గురితప్పాడంటూ

టీడీపీ నేతలు, మంత్రులు పవన్ కళ్యాణ్‌ను ఏకిపారేశారు. లోకేష్ పైన తీవ్ర విమర్శలు చేసినందుకు గాను పవన్ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. పవన్ రాజకీయ అపరిపక్వతతో మాట్లాడారని కొందరు అంటే ఆయన వెనుక మోడీ ఉన్నారని, వైసీపీ స్క్రిప్ట్ చదివారని మరికొందరు అంటున్నారు. జగన్ మాటలనే పల్లెవేస్తూ గబ్బర్ సింగ్ గురి తప్పాడని చెబుతున్నారు.

దెబ్బకొట్టాడు, ఆ రెండే కారణం!: రూటుమార్చి 'పవర్' వైపు, పవన్ పక్కా వ్యూహంతో!!దెబ్బకొట్టాడు, ఆ రెండే కారణం!: రూటుమార్చి 'పవర్' వైపు, పవన్ పక్కా వ్యూహంతో!!

సోదరుడిని లాగి, బీజేపీ చేతిలో పావుగా మారారని

సోదరుడిని లాగి, బీజేపీ చేతిలో పావుగా మారారని

పవన్ బీజేపీ చేతిలో పావుగా మారారని, ఆయనను తాము గౌరవంగా చూసుకుంటే ఇలాగేనా మాట్లాడేదని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అంతేకాదు, పవన్ వ్యాఖ్యల వెనుక మోడీ ఉన్నారని, ఇక ఎదురుదాడికి దిగండని చంద్రబాబు టీడీపీ నేతలకు ఆదేశాలు కూడా జారీ చేశారని అంటున్నారు. అయితే వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేయవద్దని సూచించారట.

పవన్ లెఫ్ట్ అంటే టీడీపీ రైట్ అంటోంది!

పవన్ లెఫ్ట్ అంటే టీడీపీ రైట్ అంటోంది!

పవన్‌కు కౌంట్ డౌన్ ప్రారంభమైందని మండిపడుతున్నారు. హోదా విషయంలో మొదట చిరంజీవిని ప్రశ్నించాలని టీడీపీ నేతలు సూచించడం గమనార్హం. చిరంజీవి కారణంగా కాపులు ఇరవై ఏళ్లు వెనక్కి పోయారని, ఇప్పుడు బీజేపీ పవన్‌ను పావుగా వాడుకుంటోందని దుమ్మెత్తి పోస్తున్నారు. మోత్కుపల్లి నర్సింహులు అయితే మరో అడుగు ముందుకేసి, లోకేష్ పైన చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలు లేకుంటే ప్రజలు బట్టలూడదీసి కొడదారని తీవ్ర వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. ఓ విధంగా మోడీ, జగన్, పవన్ ఒక్కటయ్యారని, పవన్‌ను బీజేపీ ఆడిస్తోందని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. అయితే ఆయన బీజేపీ రాజకీయ బద్ద వ్యతిరేకి లెఫ్ట్ తో కలిసి వెళ్లేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం.

English summary
The Telugu Desam Party is all set to break its alliance with the BJP and could exit the NDA as early as Friday. The party has also decided to support the YSR Congress Party's no-confidence motion in Parliament.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X