వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్ను అలా అంటారా!: రైల్వే జోన్‌పై పీయూష్ గోయెల్ క్లారిటీ, బాబుకు కౌంటర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: విశాఖపట్నం రైల్వే జోన్ అంశంపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ గురువారం స్పందించారు. అలాగే, తెలుగుదేశం పార్టీలకు అపాయింటుమెంట్ ఇవ్వలేదనే విమర్శల పైన కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు.

జగన్! ఇప్పుడు చెప్పు: ఎప్పటిలా పవన్ కళ్యాణ్ చురకలు, నిన్న.. నేడుజగన్! ఇప్పుడు చెప్పు: ఎప్పటిలా పవన్ కళ్యాణ్ చురకలు, నిన్న.. నేడు

ఏపీకి రైల్వే జోన్ అంశం కేంద్రం పరిశీలనలో ఉందని చెప్పారు. సంబంధిత అధికారులతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. చర్చల అనంతరం తుది నిర్ణయం వెల్లడిస్తామని ఆయన తెలిపారు.

టీడీపీ ఎంపీలను కలవలేదనడం సరికాదు

టీడీపీ ఎంపీలను కలవలేదనడం సరికాదు

తాను తెలుగుదేశం పార్టీ ఎంపీలను ఉద్దేశ్యపూర్వకంగా కలవలేదని చెప్పడం సరికాదని పీయూష్ గోయల్ అన్నారు. రెండు రోజుల క్రితం వైసీపీ ఎంపీకి అపాయింటుమెంట్ ఇచ్చిన పీయూష్.. టీడీపీ ఎంపీలకు మాత్రం ఇవ్వలేదని వార్తలు వచ్చాయి.

చంద్రబాబు నాయుడు కూడా ఆగ్రహం

చంద్రబాబు నాయుడు కూడా ఆగ్రహం

వైసీపీకి ఇచ్చి టీడీపీ ఎంపీలకు అపాయింటుమెంట్ ఇవ్వకపోవడంపై సీఎం చంద్రబాబు నాయుడు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు మిత్రపక్షం వైసీపీయా, మేమా అని టీడీపీ అంతర్గత భేటీలో మాట్లాడారు. ఈ నేపథ్యంలో పీయూష్ గట్టి కౌంటర్ ఇచ్చారు.

 నన్ను ఆ రోజు ఎప్పుడైనా కలవొచ్చు

నన్ను ఆ రోజు ఎప్పుడైనా కలవొచ్చు

తాను ఎంపీలను ఉద్దేశ్యపూర్వకంగా కలవలేదని చెప్పడం సరికాదని గోయెల్ చెప్పారు. ప్రతి మంగళవారం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు ఏ ఎంపీ అయినా తనను కలవవచ్చునని చెప్పారు. అలాంటప్పుడు తాను వారిని కలవలేదనడం సరికాదన్నారు.

 చట్టంలో అలా పెట్టి రాజకీయం

చట్టంలో అలా పెట్టి రాజకీయం

విశాఖ రైల్వే జోన్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తోందని గోయల్ మండిపడ్డారు. రైల్వే జోన్ అంశాన్ని పరిశీలించాలని మాత్రమే నాటి యూపీఏ ప్రభుత్వం చట్టంలో పెట్టిందని తెలిపారు. ఇది తమ పరిశీలనలో ఉందన్నారు. ఆర్థిక, సాంకేతిక అంశాలపై కమిటీ అధ్యయనం చేస్తోందన్నారు. రైల్వే జోన్ కూడా రాదని ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన క్లారిటీ ఇచ్చారు.

English summary
Union Minister Piyush Goyal on Thursday responded on Visakhapatnam Railway Zone and Telugudesam MPs meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X