ఎట్టకేలకు ఆదిమూలం బాధితురాలికి వైద్య పరీక్షలు-రిజల్ట్ పై టెన్షన్..!
ఏపీలో తాజాగా సంచలనం రేపిన టీడీపీ సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం రాసలీలల వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. తనను రేప్ చేయడంతో పాటు లైంగిక వేధింపులకు కూడా పాల్పడినట్లు టీడీపీ మహిళా కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఆమెను వైద్య పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అయితే అందుకు నిరాకరిస్తూ వస్తున్న ఆమె.. ఇవాళ ఎట్టకేలకు అంగీకరించారు.
కోనేటి ఆదిమూలం తనను హోటల్ గదికి రప్పించి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇందుకు ఆధారాలు సేకరించే పనిలో ఉన్న పోలీసులు.. ఆమెను టెస్టులు చేయింంచుకోమని కోరారు. అయితే తర్వాత వస్తానని చెప్పి వెళ్లిపోయిన బాధితురాలు ఆ తర్వాత కూడా సహకరించలేదు. చివరికి నిన్న సాయంత్రం పోలీసుల ఒత్తిడి మేరకు ఆమె టెస్టులకు అంగీకరించింది.

తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్ లో ఎమ్మెల్యే కోనేటి ఆది మూలం బాధితురాలికి వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. నిన్న సాయంత్రం మెటర్నిటీ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన ఆమెకు.. ఇవాళ మధ్యాహ్నం వరకూ వివిధ పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే స్కానింగ్ తో పాటు బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆదిమూలంపై ఆమె చేసిన ఆరోపణలు నిజమో కాదో తేలాలంటే ఈ పరీక్షల ఫలితాలు కీలకంగా మారాయి. తొలుత మెడికల్ టెస్టులకు అంగీకరించపోవడం, ఆ తర్వాత ఒప్పుకోవడం నేపథ్యంలో ఈ ఫలితాలకు ప్రాధాన్యం ఏర్పడింది.












Click it and Unblock the Notifications