టిడిపి చివరకు మా పార్టీని ఫాలో కావాల్సిందే:వైఎస్ జగన్ ట్వీట్

గుంటూరు:అవిశ్వాసం తీర్మానంపై వైసిపికి మద్దతు ఇవ్వాలని టిడిపి నిర్ణయించడం...మళ్లీ తూచ్ అంటూ మేమే అవిశ్వాస తీర్మానం పెడతామంటూ యూ టర్న్ తీసుకోవడం పై వైసిపి అధినేత జగన్ స్పందించారు. టిడిపి ప్రస్తుత పరిస్థితిని విశ్లేషిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ పెట్టారు. రాజకీయంగా అనివార్యమైన పరిస్థితిలో టిడిపి మరోసారి వైసిపినే ఫాలో అవ్వాల్సివచ్చిందని జగన్ ట్వీట్ చేశారు.

అవిశ్వాసం వైసిపి పెట్టినా...టిడిపి పెట్టినా అసలు అవిశ్వాసం పెట్టాలని అనుకుంది ముందు తామే కాబట్టి...బాబు ఎన్ని యు టర్న్ లు తీసుకున్నా చివరకు వచ్చేది మా దారిలోకే అనే అర్ధం వచ్చేట్టుగా జగన్ ఈ ట్వీట్ చేశారు. టిడిపిని టార్గెట్ చేస్తూ జగన్ చేసిన ఈ ట్వీట్ సంచలనం సృష్టిస్తోంది.

TDP should follow us: YS Jagan tweet

ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నిరసనగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వైసిపి పెట్టాలనుకున్న అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు టిడిపి గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టిడిపి శ్రేణుల్లో వచ్చిన ప్రతిస్పందనను బట్టి మళ్లీ టిడిపి అధినేత తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు వారి నుంచి వచ్చిన స్పందనను ఆదారం చేసుకొని మళ్లీ మాట మార్చారు.

ఈ విషయమై చంద్రబాబు మాట్లాడుతూ ఒక ఆర్థిక నేరగాడు పెట్టిన అవిశ్వాసానికి మనం మద్దతివ్వడమేంటని ప్రశ్నించారు. జగన్ అవిశ్వాసం పెడితే మనమెందుకు మద్దతివ్వాలన్నారు. టీడీపీయే అవిశ్వాసం పెట్టాలని లోక్ సభలో టీడీపీ నాయకుడు తోట నరసింహంను ఆదేశించారు. ఈరోజు పొలిట్ బ్యూరో సమావేశం తర్వాత ఎన్డీఏ నుంచి బయటకు వస్తున్నామని చంద్రబాబు చెప్పేశారు. దీంతో టీడీపీయే కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమైంది. అయితే టిడిపి ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఈ అవిశ్వాస తీర్మానం ఇప్పుడప్పుడే చర్చకు వచ్చే అవకాశం లేదని తెలియడమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఏదేమైనా కేంద్రంపై అవిశ్వాసం అంటేనే ఆమడదూరం వెళ్లిన టిడిపిని ఏకంగా వారే అవిశ్వాస తీర్మానం పెట్టేలా చేయగలగడం...రాజకీయంగా అనివార్యమైన ఆ పరిస్థితికి టిడిపిని కల్పించడం వైసిపి నైతిక విజయమనే అర్థంలో వైఎస్ జగన్ తన తాజా ట్వీట్ లో పేర్కొన్నారు. జగన్ ట్విట్టర్ లో ఏమని పోస్ట్ చేసారంటే
"రాజకీయంగా అనివార్యమైన పరిస్థితిలో టిడిపి మరోసారి వైసిపి కేంద్రంపై పెట్టే అవిశ్వాస తీర్మానంకు మద్దతు పలకాల్సివచ్చింది...ఇది ఆంధ్రప్రదేశ్ మరియు ప్రజాస్వామ్యం విజయం. వైఎస్ఆర్ సిపి ప్రత్యేక హోదా కోసం, ఎపి ప్రజల హక్కుల కోసం పోరాడుతూనే ఉంటుంది"..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+